తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె కి సీఎం కేసీఆర్ ఎట్టకేలకు ముగింపు పలికాడు. దాదాపుగా టీఎస్ ఆర్టీసీ కార్మికులు 52 రోజులు సమ్మెలో పాల్గొన్నారు. కానీ, ఆర్టీసీ కార్మికుల ఏ డిమాండ్స్ కి ప్రభుత్వం ఒప్పుకోలేదు. దీనితో గత్యంతరం లేక ఆర్టీసీ కార్మికులు సమ్మె నుండి వెనక్కి తగ్గగా.. గురువారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ క్యాబినెట్ భేటీ అయ్యి .. ఆర్టీసీ సమ్మెకు ముగింపు పలకాలని నిర్ణయం తీసుకోవడంతో గత రాత్రి సీఎం కేసీఆర్ ఆర్టీసీ కార్మికులు శుక్రవారం పొద్దుటి నుండి హాయిగా మీ విధుల్లోకి చేరండి అని శుభవార్త చెప్పారు. అలాగే కార్మికులు విధుల్లో చేరాలి అంటే ప్రభుత్వం ఏదైనా షరతులు పెడుతుంది అని అనుకున్నారు. కానీ , సీఎం కేసీఆర్ అలాంటిదేమి లేకుండా డైరెక్ట్ గా కార్మికులని ఉద్యోగం లో చేరమని చెప్పడం శుభపరిణామం. అందరం కలిసి ఆర్టీసీని ముందుకు తీసుకుపోదాం.. లాభాల బాటలో ఉన్నప్పుడు మీకు కూడా సింగరేణి కార్మికుల మాదిరి అధిక బోనస్ లు తీసుకోవచ్చు అని - ఇకనైనా ఆ యూనియన్ల మాయలో పడకుండా.. ఉద్యోగం లో చేరి ఆర్టీసీని బ్రతికించుకోండి అని చెప్పారు.
ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆర్టీసీ సమ్మె పై తీసుకున్న ఈ నిర్ణయం పై తెలంగాణ బీజేపీ నేత లక్ష్మణ్ స్పందించారు. సమ్మె పై కేసీఆర్ యు టర్న్ తీసుకోవడానికి ముఖ్య కారణం కేంద్రం కేసీఆర్ పై తెచ్చిన ఒత్తిడి అని చెప్పారు. ఈ సమ్మె పై కేంద్రం సీరియస్ గా స్పందించే క్రమంలో సీఎం కేసీఆర్ యు టర్న్ తీసుకున్నాడు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను తాను స్వయంగా కలిసి ఆర్టీసీ సమ్మెపై నివేదిక ఇచ్చినట్లు తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాకు పరిస్థితిని వివరించామని చెప్పారు.
సమస్యను కేంద్రం సీరియస్ గా తీసుకోవడం - ప్రైవేటీకరణకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అంగీకరించకపోవడం వంటి కారణాలతో సీఎం వెనక్కి తగ్గారని వివరించారు. సమ్మె కాలంలో కార్మికుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించి, బాధిత కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా - ఉద్యోగం ఇవ్వాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అలాగే యూనియన్లే అవసరం లేదన్నప్పుడు.. ఆర్టీసీలో మొన్నటివరకు మీ అల్లుడు హరీశ్ రావు ఎందుకు గౌరవాధ్యక్షులుగా ఉన్నారు? సింగరేణిలో మీ కూతురు కవిత ఎందుకు నాయకురాలిగా కొనసాగారు? టీఆర్ ఎస్ కు కార్మిక విభాగం ఎందుకు? అని కేసీఆర్ ని ప్రశ్నించారు. అలాగే ఆర్టీసీ చార్జీలు పెంచి పేదలపై భారం మోపవద్దని ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాలను సన్నాసులు - పనికిమాలినోళ్లు - చిల్లర గాళ్లు అని మాట్లాడటం మంచి పద్దతి కాదు అని చెప్పుకొచ్చారు.