తెలంగాణ కేబినెట్ నుంచి ముగ్గురు ఔట్.. సంక్రాంతి తర్వాత విస్తరణ.. ఆ నలుగురిలో ఒకరికి చోటు
తెలంగాణ కేబినెట్ విస్తరణకు సమయం వచ్చిందా..? ఎన్నికలు మరో ఏడాది కూడా లేని వేళ.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారా? ముగ్గురు మంత్రులను తప్పించనున్నారా? వారి స్థానంలో బీసీల నుంచి ఒకరిని, ఎస్సీల నుంచి ఇద్దరిని తీసుకోనున్నారా? దీనికి ఔననే సమాధానమే వస్తోంది. సంక్రాంతి తర్వాత సీఎం కేసీఆర్ కేబినెట్ లో మార్పులు చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ మార్పులు స్వల్పంగానే ఉంటాయని తెలుస్తోంది. దీనికి సంక్రాంతి తర్వాత లేదా ఫిబ్రవరి తొలి వారంలో ముహూర్తం నిర్ణయించినట్లుగా స్పష్టమవుతోంది.
ఏడాదిన్నర నుంచి ఈటల పోస్టు ఖాళీ
వరుసగా రెండోసారి తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన సమయంలో తొలుత సీనియర్ నేతలు ఈటల రాజేందర్, హరీశ్ రావు, కేటీఆర్ లకు చోటు దక్కలేదు. అనంతరం వీరికి స్థానం కల్పించారు. వీరిలో ఈటలపై ఆరోపణలు మోపి గతేడాది మేలో పదవి నుంచి తొలగించారు. అప్పటినుంచి ఆయన చూస్తున్న ఆరోగ్య శాఖ బాధ్యతలను హరీశ్ కు అప్పగించారు. మరెవరినీ ఈటల స్థానంలో మంత్రివర్గంలోకి తీసుకోలేదు.
కొనుగోలులోని నలుగురిలో ఒకరికి చోటు
ఇటీవల మునుగోడు ఎన్నికకు ముందు వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదంతంలో ఉన్న నలుగురు శాసన సభ్యుల్లో ఒకరికి మంత్రి పదవి దక్కనున్నట్లు తెలుస్తోంది. ఇక సీనియర్ నేతలు కడియం శ్రీహరి, మాజీ స్పీకర్ మధుసూదనాచారి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్, బండా ప్రకాష్ లలో ఇద్దరు లేదా ముగ్గురికి మంత్రి యోగం దక్కొచ్చని సమాచారం.
ఆ వివాదాస్పద మంత్రిపై వేటు
గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన ఓ మంత్రిని తప్పించి మరో ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇచ్చే యోచన చేస్తున్నట్లు కూడా చెప్పుకొంటున్నారు. ఈ లెక్కన చూస్తే తెలిసీ తెలియని వ్యాఖ్యలు, జిల్లా ఎమ్మెల్యేల నుంచి వ్యతిరేకత, ఇటీవల ఐటీ దాడులను ఎదుర్కొన్నమంత్రి మల్లారెడ్డిపై వేటు పడుతుందని అర్థమవుతోంది. కార్మిక మంత్రి మల్లారెడ్డి పనితీరుపై సీఎం అయిష్టతతో ఉన్నారని అంటున్నారు.
ఆ కీలక పథకం మంత్రిపైనా..?
రాష్ట్ర ప్రభుత్వం ఓ సంక్షేమ పథకాన్ని అత్యంత కీలకంగా భావిస్తోంది. కానీ, ఆ శాఖ చూసే మంత్రి సంబంధిత పథకం అమలులో చూపుతున్న పనితీరు సీఎంకు నచ్చడం లేదని సమాచారం. కాగా, సచివాలయం సంక్రాతికి ప్రారంభించి.. ఆపై అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించి జనవరి మూడో వారం లేదా ఫిబ్రవరిలో కేబినెట్ లో మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది.