తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సొంత డబ్బాపై మోజు పుట్టిందా? సందర్భంగా ఏదైనా, అవకాశం దొరికినప్పుడల్లా తన గురించి ప్రచారం చేసుకునేందుకు గులాబీ దళపతి ప్రయత్నం చేస్తున్నారా? ఈ విషయంలో ప్రతిపక్ష పార్టీలకు గులాబీ దళపతి టార్గెట్ అయ్యారా? అంటే అవుననే సమాదానం వస్తోంది. ఈ నెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను మూడు రోజులు జరపాలని టీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకోవడం గురించే ఈ చర్చ అంత.
మూడు రోజుల వేడుకల గురించి తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ వివరిస్తూ ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మహిళా దినోత్సవం వేడుకలు జరుగుతాయని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం వల్ల మహిళలకు అందిన ఫలాల గురించి వివరించబోతున్నామని తెలిపారు.
సీఎం కేసీఆర్ మహిళలకు సంక్షేమం అనేక పథకాలను అందుబాటులోకి తీసుకువచ్చారని, కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌తో ప్రతి ఆడబిడ్డకి అండగా ఉంటున్నారన్నారు. 6వ తేదీన గ్రామంలో కేసీఆర్ ఫొటోకు రాఖీ కట్టే కార్యక్రమం నిర్వహించబోతున్నట్లు ఆమె తెలిపారు. అంతేకాకుండా 7వ తేదీన కళ్యాణలక్ష్మీ- కేసీఆర్ కిట్- అందిన కుటుంబాలతో భేటీలు నిర్వహిస్తామన్నారు. కరోనా సమయంలో మహిళలకు- గర్భిణీలకు ఇబ్బంది లేకుండా చూసుకున్నామని ఆమె అన్నారు.
కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక సమాజంలో మార్పు కోసం ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గతంలో సమ్మర్ వస్తే నీళ్ల కోసం మహిళలు ఎదురుకున్న ఇబ్బందులు ఎన్నో ఉన్నాయని, కానీ కేసీఆర్ సీఎం అయ్యాక మహిళలకు నీళ్ల కష్టం లేకుండా చేశారని ఆమె అన్నారు.
కేసీఆర్ ప్రభుత్వంలో షీ టీమ్స్ ఏర్పాటు చేశారని, పోలీస్ శాఖలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కేసీఆర్ తెచ్చారని ఆయన వెల్లడించారు. ఎన్‌ఆర్‌ఐ వేధింపులను అరికట్టేందుకు ప్రత్యేక ఎన్‌ఆర్ఐ సెల్ ఏర్పాటు చేశారని, మహిళలకు ఆర్థిక భద్రత కోసం, వడ్డీ లేకుండా రుణాలు టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇస్తోందని ఆమె అన్నారు.
మహిళలు రాజకీయంగా ఎదగాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ కోరుకుంటారని, నామినేటెడ్ పోస్టులు మహిళలకు కేటాయించి ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించారన్నారు. మూడు రోజుల పాటు జరిగే మహిళా దినోత్సవ వేడుకల్లో మహిళలందరూ పాల్గొనాలన్నారు.
కాగా, ఈ మూడురోజుల సంబురాలపై కాంగ్రెస్ పార్టీ భగ్గుమంది. మూడు రోజులు తెలంగాణలో తమాషా కార్యక్రమం జరగబోతోందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రవళి అన్నారు. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతనే మహిళలు బతుకుతున్నారు అనే విధంగా టీఆర్ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని, కేసీఆర్ వచ్చిన తర్వాతే ఆడ పిల్లలకు పెళ్ళిళ్ళు అయినట్లు.. టీఆర్ఎస్ వచ్చిన తర్వాతే పిల్లలు పుడుతున్నట్లు టీఆర్ఎస్ నేతలు చేస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు.
కేసీఆర్ ఇంట్లోంచి పెన్షన్లు ఇస్తున్నారా.. ఎందుకు రాఖీ కట్టాలని ఆమె ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో మంత్రి పదవులు అనుభవించిన సబితా ఇంద్రారెడ్డి కూడా టీఆర్ఎస్ ను పొగడడం ఆశ్చర్యం వేసిందని ఆమె అన్నారు. ఎంపీ మాలోతు కవిత ఎక్కడి నుంచి వచ్చిందో మర్చిపోయిందా.. కాంగ్రెస్ బిక్ష వల్లే కవిత రాజకీయాల్లో ఉందని ఆమె విమర్శించారు. టీఆర్ఎస్ మద్యం పాలసీ వల్ల.. ఎంతో మంది ఆడబిడ్డల తాళి బోట్లు తెగాయని ఆమె మండిపడ్డారు.