కేసీయార్ రాజకీయ చాణక్యం ఇపుడు ఏపీ గురించి ఆలోచిస్తోంది. కేసీయార్ వ్యూహాలు పక్కాగా ఉంటాయి. అవి కూడా ఒక పద్ధతి ప్రకారం ఉంటాయి. ప్రత్యర్ధుల బలహీనతలను ఒడిసిపట్టుకుని దాని మీద దూకుడు చేయడం కేసీయార్ పొలిటికల్ స్టైల్. ఇక ఉమ్మడి ఏపీకి మంత్రిగా పనిచేసి సుదీర్ఘ కాలం ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో ఉన్న కేసీయార్ కి ఆంధ్ర నాడి తెలియనిది కాదు.
అదే టైం లో చంద్రబాబు స్కూల్ ఏంటో తెలుసు. వైసీపీ అధినేత జగన్ ప్లాన్స్ కూడా ఆయనకు బాగా తెలుసు. దాంతో పాటు ఏపీ ప్రజల సెంటిమెంట్లు, వారి ఆలోచనలు పూర్తిగా అవగాహన ఉంది. ఒక్క మాటలో చెప్పాలీ అంటే కేసీయార్ కి దేశంలో మిగిలిన రాష్ట్రాల సంగతేమో కానీ ఏపీ పాలిటిక్స్ మాత్రం బాగా ఫోకస్ పెడితే కలసివచ్చే అవకాశం ఉంది అని చెప్పాలి.
ఏపీలో కులాల సమీకరణలు, ఎత్తులు పై ఎత్తులు అన్నీ కూడా ఆయనకు కరతలామళకం అంటున్నారు. ఆ ధైర్యంతోనే కేసీయార్ ఏపీలో బీయారెస్ బండి యమ జోరే అంటున్నారు. ఇక ఏపీ నుంచి కీలక నేతలు బీయారెస్ లో చేరిన సందర్భంగా కేసీయార్ కొన్ని కీలక కామెంట్స్ చేశారు. మేమే కర్తలం మేమే భర్తలం అని అనుకుంటే కుదరదు అంటున్నారు.
అంతే కాదు అంతా మేమే చేయగలం అన్న భావన కూడా అక్కడ మారాలి అని ఆయన అంటున్నారు. ఈ కామెంట్స్ ఆయన ఎవరిని ఉద్దేశించి అని ఉంటారన్నదే ఇపుడు చర్చగా ఉంది. ఏపీలో జగన్ అధికారంలో ఉన్నారు. దాంతో ఆయన అధికార పార్టీ మీదనే గురి పెట్టారని అంటున్నారు. అలాగే ఏపీలో అసలు సిసలు ప్రజా రాజకీయాలు మొదలు కావాలని ఆయన అన్నారు.
అంటే ఏపీలో అధికార వైసీపీ విపక్ష తెలుగుదేశం పార్టీలు రెండు కూడా ఆ దిశగా పనిచేయడం లేదు అన్న విమర్శలు ఉన్నాయనే అంటున్నారు. అలాగే దేశంలో మార్పు కోసం ఏపీ కూడా భాగస్వామ్యం కావాలని కేసీయార్ పిలుపు ఇస్తున్నారు. అంటే జాతీయ రాజకీయాల్లో మార్పు అన్నది ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం పోతేనే సాధ్యపడుతుంది అని కేసీయార్ నమ్ముతున్నారు.
ఏపీలో చూస్తే ప్రధాన పార్టీలు అన్నీ బీజేపీతో దోస్తీ కడుతూనే ఉన్నాయి. దాంతో అన్నీ ఆలోచించే ఆయన ఈ పిలుపు ఇచ్చారని అంటున్నారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రజలు తమను తెలంగాణాలో కలపాలని అక్కడ పధకాలు అమలు చేయాలని అడుగుతున్నారని కేసీయార్ చెప్పుకొచ్చారు. అంటే ఏపీకి కూడా తమ పధకాలు విస్తరిస్తామని ఏపీని కూడా బీయారెస్ ఏలుబడిలఒకి తెస్తామని కేసీయార్ చెబుతున్నారు.
మొత్తానికి కేసీయార్ ఏపీ రాజకీయాల మీద చేసిన కామెంట్స్ అటు జగన్ కి ఇటు చంద్రబాబుకు కూడా గుచ్చుకునేలా ఉన్నాయనే అంటున్నారు. మరి ఆయనే ఏపీకి స్వయంగా వచ్చి ప్రసంగాలు చేస్తే కచ్చితంగా రెండు ప్రధాన పార్టీల అధినాయకులనే టార్గెట్ చేస్తారని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.