కెసీఆర్ ఆ మాట చెబితే డౌట్లుండవ్...

Update: 2017-11-04 15:30 GMT
తెలంగాణలో ఆయన మాటే శాసనం. ఆయన చెప్పిందే వేదం. అనుకున్నది సాధించాలి. ఆడినమాట ఆచరణలో పెట్టాలి. ఇది తెరాస అధినేత కెసిఆర్ కి వర్తించేవి. కేసిఆర్ ఏది అనుకున్నా... టకటకా... ఆచరణలోకి రావాల్సిందే. ఆలోచనలు ప్రజాహితాన్ని కాంక్షించేవి. ప్రభుత్వ విధానాలు.... ముఖ్యమంత్రిగా కెసీఆర్ వ్యవహరిస్తున్న తీరూతెన్నులపై ప్రతిపక్షాల విమర్శలు సర్వసాధారణమయ్యాయి. ప్రతిపక్షాల మాటలు పెద్దగా పట్టించుకోవద్దని కెసీఆర్ తన చాతుర్యంతో సభల్లో సంకేతమిచ్చేవారు.

కొత్త సెక్రటేరియేట్ నిర్మాణం విషయంలో అనేక సందేహాలు రేగుతున్న సమయంలో.. పాత సచివాలయ స్థలాన్ని ఏం చేయబోతున్నారనే సంగతి మాత్రం కేసీఆర్ తేల్చి చెప్పలేకపోవడం ఆయనకు డిసడ్వాంటేజీ అవుతున్నదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పాత సచివాలయ స్థలం ఏమౌతుంది అనే సంగతి కేసీఆర్ ముడివిప్పకపోవడం వలన.. ఆయన మీద రాజకీయ ప్రత్యర్థులు విమర్శలు చేయడానికి ఆస్కారం ఏర్పడుతోందనే అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.

తాజాగా శాసనసభ సమావేశాల్లో కొత్త సచివాలయ ప్రాంగణం, శాసనసభ, తెలంగాణ కళానిలయం సముదాయాన్ని బైసన్ పోలో గ్రౌండ్లో ఏర్పాటు ప్రస్తావన చర్చనీయాంశమైంది. దశాబ్ధాల తరబడి నిర్వహణలో ఉన్న శాసనసభ, సచివాలయాలకు ఏమైందని ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీశారు. వాటన్నింటినీ కెసీఆర్ తిప్పికొట్టే ప్రయత్నంచేశారు. చెత్తభవంతులని తీసిపారేశారు. ప్రణాళికాబద్ధంగా లేదని తప్పులు చూపించారు. సభలో సభ్యుల విమర్శలను పట్టించుకోని కెసిఆర్ బైసన్ పోలో గ్రౌండులో సుంరద భవంతులు నిర్మించే విషయంలో వెనుక అడుగు వేసేది లేదన్నారు. ఇపుడున్న సచివాలయ ప్రాంగణాన్ని ప్రజల ఆస్థిగా పరిగణించి భావితరాలవారు చిరకాలం గుర్తుంచుకునే విధంగా

‘‘ ఐకానిక్ టవర్స్ ’’ నిర్మించేందుకు ప్రయత్నిస్తామనీ, బైసన్ పోలో గ్రౌండులో తెలంగాణ సంస్కృతికి అద్ధంపట్టే విధంగా కొత్త శాసనసభ, సచివాలయం ప్రాంగణాలకు రూపకల్పన చేస్తామని ముఖ్యమంత్రి కెసిఆర్ చెప్తే... అనుమానాలను ఆస్కారంలేకుండా పోతుంది. మనసులో మంచి ఉద్ధేశం ఉంది. చేసే మంచిపనుల్లో అనుమానాలకు అవకాశం కల్పించి విమర్శల పాలవుతున్నారు.

విపక్ష సభ్యుల ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని మండిపడుతున్నారు. సచివాలయ స్థలంపై కేసిఆర్ గుట్టు విప్పుతామని తెలంగాణ ఐకాస కన్వీనర్ ఆచార్య కోదండరామ్ అనడంతో అనుమానాలు తలెత్తాయి. ఖరీదైన స్థలాన్నికార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టి లబ్థిపొందేందుకే కెసిఆర్ యోచిస్తున్నారనే ఆరోపణ కెసీఆర్ పనితీరు, వ్యవహారశైలినే శంకలు రేకెత్తిస్తోంది.  ఈ విషయంలో తన చిత్తశుద్ధికి ప్రజాదరణ దక్కాలంటే గనుక.. పాత సచివాలయ స్థలం కార్పొరేట్ శక్తుల బారిన పడదని, ఎప్పటికీ ప్రజల ఆస్తిగానే ఉంటుందని, దానికి తాను పూచీ వహిస్తానని కేసీఆర్ నిరూపించాలి. ప్రజలకు స్పష్టత ఇవ్వాలి.  తెలంగాణ జాతిగౌరవాన్ని కాపాడేందుకు కొత్త సచివాలయ ప్రయత్నమే తప్ప.. పాత స్థలాన్ని కార్పొరేట్ లకు ఇవ్వడానికి కాదని ఆయన క్లారిటీ ఇస్తే.. విపక్షాల నోళ్లు మూయించడంతో పాటూ.. ప్రజల్లో కేసీఆర్ గౌరవం పెరుగుతుందని పలువురు భావిస్తున్నారు.
Tags:    

Similar News