రాజకీయ అంచనాలు, వ్యూహాల్లో ముందుండే తెలంగాణ సీఎం కేసీఆర్ ఎన్నికల కోసం రెడీ అయిపోతున్నారు. ఈ ఏడాది చివరినాటికి లోక్‌సభకు ఎన్నికలు రావడం ఖాయమని, దాంతో పాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు తప్పవని అంచనా వేస్తున్న ఆయన అందుకోసం ఇప్పటి నుంచే వ్యూహాలను సిద్ధం చేస్తున్నారు. ఒంటరి పోరుకు సిద్ధమైన కేసీఆర్‌కు ఎన్నికల్లో టిక్కెట్ల కేటాయింపు ప్రధాన సమస్యగా మారనుంది. సగటున ఒక సీటుకు 9 మంది టిక్కెట్లు ఆశిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో ఇప్పటి నుంచే కట్ చేసుకుంటూ పోయి ఈ సగటును 3కి తేవాలని కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పుడే ఎలాంటి కన్ఫ్యూజన్, పొరపాటు అంచనాలు లేకుండా సరైన అభ్యర్థులను ఎంపిక చేయొచ్చన్నది ఆయన ప్రణాళికగా తెలుస్తోంది. ఇందుకోసం ఎలిమినేషన్ ప్రక్రియ మొదలుపెట్టేందుకు గాను కొన్ని పెరామీటర్స్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది.
తెలంగాణలోని 119 అసెంబ్లీ సీట్లలో 7 ఎంఐఎం సిటింగు స్థానాలు పోగా మిగతా 112 సీట్లకు టీఆరెస్ నుంచి టిక్కెట్లు అశిస్తున్నవారి సంఖ్య భారీగా ఉంది. టిక్కెట్ల కోసం ప్రయత్నాలు చేస్తున్నవారు వెయ్యిమందికి పైగా ఉన్నారు. వీరంతా ఇప్పటికే హరీశ్ రావు, కేటీఆర్, కవిత ద్వారా ప్రయత్నాలు చేస్తున్నారట.
కాగా ప్రస్తుతం ఇతర పార్టీల నుంచి వచ్చినవారితో కలిపి టీఆరెస్‌కు 90 మంది ఎమ్మెల్యేలున్నారు. అయితే.. వీరిలో సగం మంది మాత్రమే పక్కాగా గెలుస్తారన్న పొజిషన్లో ఉన్నారు. మిగతా చోట్ల చాలామంది సిటింగులు కూడా టిక్కెట్ కోసం పోటీపడాల్సిన పరిస్థితి. ఇలాంటి నియోజకవర్గాల్లో టిక్కెట్లు ఆశిస్తున్నవారి సంఖ్య భారీగా ఉంది. పైగా ఎప్పటి నుంచో టీఆరెస్‌లో ఉన్న నేతలే కాకుండా ఇతర పార్టీల నుంచి వచ్చిన మాజీలు కూడా చాలామంది టిక్కెట్ల కోసం బలంగా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో కేసీఆర్ ఇప్పటి నుంచే ఎంపిక ప్రక్రియను ప్రారంభించాలనుకుంటున్నారట. అందుకోసం కొన్ని నిబంధనలు పెట్టుకుని వారి ప్రయత్నాలు తన వరకు రాకముందే ఎలిమినేట్ చేయడం మొదలుపెట్టనున్నట్లు తెలుస్తోంది.