నెత్తురు మరిగిన వేళ ఆయన మాట్లాడారు. బక్కచిక్కిన దేహంతో ఆయన పోట్లాడిన వైనం దేశం నివ్వెర పోయేలా చేసింది. సత్తువ ఉన్నంత వరకూ పోరాడతాను అని చెప్పి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్షకు కూర్చొని సంచలనమే అయ్యారు.ఆ విధంగా కేసీఆర్ గొప్ప సాహసి. తెలుగువాడి సాహసం వాడిలోనే ఉంది అనేంతగా ఆ వేళ తెలంగాణ వాదులు మురిసిపోయారు.తరువాత కాలంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమ పార్టీ నుంచి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందింది. అప్పట్లో విలీన ప్రతిపాదన వచ్చింది.
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం అయిన ఎనిమిదేళ్ల తరువాత మళ్లీ విలీన ప్రతిపాదన వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ ఎంతో తేడా.. ఆ రోజు కేసీఆర్ అనే నాయకుడు కాంగ్రెస్ అధినేత్రి సోనియా ఏం చెప్పినా వినేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ మాత్రం అధినేత్రి ఏం చెప్పినా వినని స్థితిలో ఉన్నారు. ఆ మాటకు వస్తే కాంగ్రెస్ కన్నా సోనియా కన్నా ఓ ఉప ప్రాంతీయ పార్టీ ఇంతటి బలం పుంజుకోవడం చాలా గొప్ప విషయం.
పార్టీ ఆరంభమై 20 ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఏ విభేదాలు లేకపోవడం వేరు కుంపట్లు ఉన్నా వాళ్లెవ్వరూ పెద్దగా రాణించక పోవడం మరో విశేషం. మొదట కేసీఆర్ నుంచి విభేదించి టీఆర్ఎస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన ఆలె నరేంద్ర వెళ్లిపోయి వివిధ పార్టీలలో అడుగు పెట్టారు. ఏవో పదవులు పొందారు కానీ నిలదొక్కుకోలేదు. అదేవిధంగా కేసీఆర్ తో కలిసి పనిచేసిన కోదండ రామ్ కూడా తెలంగాణ జన సమితి పేరిట వేరు కుంపటి పెట్టారు. కానీ ఆ పార్టీ మరియు ఆయన కూడా నెగ్గుకు రాలేదు.
ఇక కేసీఆర్ ను కాదని చాలా మంది నాయకులు వేర్వేరు పార్టీలకు పోయి కొంత విజయం సాధించిన దాఖలాలు ఉన్నా కూడా వాళ్లిప్పుడు ఏటికి ఎదురీదుతున్నారు అన్నది ఓ వాస్తవం. ఆ విధంగా హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ (బీజేపీ), దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ (బీజేపీ) ఏ విధంగానూ తమ సత్తా ఇతర పార్టీలలో పూర్తి స్థాయిలో చూపలేకపోయా రు.
ప్రజాభిమానం ఉన్న నాయకులుగా పేరొందినా కూడా, టీఆర్ఎస్ ను వీడి ఉప ఎన్నికల బరిలో గెలుపు సాధించినా కూడా వీరి ప్రభావం అంతంత మాత్రమే ! కాల గతిలో ఆర్.ఎస్.ప్రవీణ్ లాంటి ఉన్నతాధికారులు కూడా ఉద్యోగ జీవితానికి గుడ్ బై చెప్పి, బీఎస్పీ లాంటి పార్టీల వెనుక నడిచినా కూడా తెలంగాణలో ప్రభావం చూపలేకపోయారు.
రెండు దశాబ్దాలకు పైగా చేసిన ప్రయాణంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొంది. కానీ దేశంలోనే అతి పెద్ద కార్యాలయం ఉన్న ఉప ప్రాంతీయ పార్టీగా అవతరించింది. కేసీఆర్ ఆ రోజు వైఎస్సార్ తోనూ, అటుపై చంద్రబాబుతోనూ మంచి స్నేహబంధాలే కొనసాగించారు. కానీ సమైక్య పాలకులను ఉద్యమ కాలంలో నోటికి వచ్చిన విధంగా తిట్టారు. బంగారు తెలంగాణ సాధనే ధ్యేయమని చెప్పారు.
ఆ విధంగా కాళేశ్వరం లాంటి ఎత్తి పోతల పథకాన్ని ప్రారంభించి మంచి పేరే తెచ్చుకున్నారు. ఇంకా కొన్ని ఎత్తిపోతల పథకాలనే చూపించి ఇదే అభివృద్ధి అనేలా ఆయన ప్రచారం చేసుకుంటున్నారు అన్నది విపక్షాల వాదన. ఎవరు ఏం అనుకున్నా కూడా బంగారు తెలంగాణలో సాధించాల్సినవి, కేసీఆర్ శాసించాల్సినవి చాలానే ఉన్నాయి. వాటి సాధన దిశగా గులాబీ దండు అడుగులు వేస్తే కేసీఆర్ కు మరో సారి అధికారం దక్కడం ఖాయం. అటుపై మరోసారి విలీనం అన్న మాటే రాదు గాక రాదు కూడా !