అమరవీరులకు నివాళులర్పించిన తెలంగాణ సీఎం !

Update: 2021-06-02 09:30 GMT
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గన్‌ పార్క్‌ లోని అమరవీరుల స్మారక స్తూపం వద్ద ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు నివాళ్లు అర్పించారు. సీఎంతో కేసీఆర్‌ తో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌, ఎంపీ సంతోష్‌ కుమార్‌, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మాజీ స్పీకర్‌ మధుసూదనచారి, మేయర్‌ విజయలక్ష్మి అమరవీరులకు నివాళులర్పించారు. ఆ తర్వాత గన్‌ పార్క్‌ నుంచి సీఎం కేసీఆర్ నేరుగా ప్రగతి భవన్‌ చేరుకొని రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. జాతీయ జెండాను ఎగుర వేసి, వందనం చేశారు.

కరోనా వైరస్ విజృంభణ పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రావతరణ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. కరోనా వ్యాప్తి  నేపథ్యంలో వరుసగా రెండో సంవత్సరం కూడా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా సాగుతున్నాయి. తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. కరోనా నేపథ్యంలో వరుసగా రెండో సంవత్సరం తెలంగాణ ఆవిర్భావ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా నిరాడంబరంగా సాగుతున్నాయి. 
Tags:    

Similar News