టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కరీంనగర్ పార్లమెంట్ ఎన్నికల ప్రచార సభలో ఒకటి స్పష్టం చేశారు. ఒక తన ఫోకస్ తెలంగాణ కాదు అని.. దేశమే అని కుండబద్దలు కొట్టారు. మరో ఆరు నెలల్లో కాళేశ్వరం పూర్తి అవుతుందని.. మిషన్ భగీరథ పూర్తి అయ్యి తెలంగాణ తాగునీటి గోస పోతుందన్నారు. ఇక తన దృష్టి అంతా దేశాన్ని బాగు చేయడమేనని సంచలన ప్రకటన చేశారు. అవసరమైతే ఇందుకోసం తాను జాతీయ పార్టీని స్థాపిస్తానని ప్రకటించారు. తెలంగాణ కోసం పోరాడి సాధించినట్టే చివరి రక్తం బొట్టు వరకూ జాతీయ రాజకీయాల్లో పోరాడుతానని ప్రకటించారు. దేశ రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలని.. దేశానికి తెలంగాణ చోదకశక్తి కావాలన్నారు. దేశ రాజకీయాల్లో మార్పులు రావాల్సిన అవసరముందని ఉదాహరణలతో సహా కేసీఆర్ వివరించారు.
కరీంనగర్ నుంచే తెలంగాణ ఉద్యమం మొదలు పెట్టానని.. కరీంనగర్ ప్రజల ఆజ్ఞ ఉంటే జాతీయ పార్టీని స్థాపించి దేం మొత్తాన్ని ఒక్కటి చేస్తానని కేసీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరీంనగర్ నాకు కలిసి వచ్చిందని.. అందుకే ఈ గడ్డ నుంచే తాను జాతీయ రాజకీయల ప్రకటన చేస్తున్నానని కేసీఆర్ చెప్పుకొచ్చారు. నాకు కలిసి వచ్చిన పోరాటాల గడ్డ నుంచి చెబుతున్నా.. ఎక్కడో చోట ఎవరో ఒకరు నడుంకట్టకపోతే దేశం బాగుపడదన్నారు. దేశ రాజకీయాలను ప్రభావితం చేయగల సమయం దగ్గర పడుతోందన్నారు. దేశంలో వ్యవస్థాగతమైన మార్పులు రావాలన్నారు. 16మంది టీఆర్ ఎస్ ఎంపీలను గెలిపిస్తే.. నేను 160మంది ఎంపీలను జయిస్తా.. కరీంనగర్ ప్రజల దీవెనలతో ఫెడరల్ ఫ్రంట్ రాజకీయాలను బలోపేతం చేసి దేశాన్ని కాంగ్రెస్, టీఆర్ఎస్ దుర్మార్గుల నుంచి విముక్తి చేసి అద్భుతమైన భారత్ ను నిర్మిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు.
దేశ రాజకీయాలను ప్రభావితం చేసేందుకు అవసరమైతే జాతీయ రాజకీయాల్లోకి వెళ్లి పార్టీ పెడుతానన్న కేసీఆర్ ప్రకటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవేళ కేంద్రంలో హంగ్ వస్తే కేసీఆర్ కీలకంగా మారే అవకాశం ఉంది. అప్పుడు ప్రధాని పదవిని చేపట్టవచ్చు. ఇప్పుడు ప్రధాని పదవే టార్గెట్ గా కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ పండితులు చెబుతున్నారు.