కరోనా వేళ ఇప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పుడు లేని విధంగా మీడియాలోనూ వర్కు ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నారు. ఇలాంటి వేళలో.. పక్కా ప్లానింగ్ లేకుంటే మీడియాలో అనుకున్న పని అనుకున్న సమయానికి పూర్తి చేయటం చాలా కష్టం. మిగిలిన రంగాలకు భిన్నంగా మీడియాలో టార్గెట్లు రోజువారీగా ఉండటమే కాదు.. వాటిని అమలు చేయటంలో ఏ మాత్రం తేడా వచ్చినా మొదటికే మోసం వస్తుంది.
మరీ ముఖ్యంగా ప్రింట్ మీడియా పరిస్థితి మరింత ఇబ్బందికరం. అర్థరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట లోపు ప్రతి మీడియా సంస్థ తన ఎడిషన్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కొన్ని సంస్థలు అయితే రాత్రి పదకొండు గంటలకే దుకాణం కట్టేస్తారు. ఇంగ్లిషు మీడియా మరింత ముందే పని పూర్తి చేసేలా ప్లానింగ్ ఉంటుంది. దీనికి కారణం.. చాలా ఇంగ్లిషు మీడియా సంస్థల ప్రింటింగ్ తెలుగు రాష్ట్రాల్లో వాటికంటూ సొంతం ఉండకుండా.. వేరే వారితో టై అప్ పెట్టుకోవటమే.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో.. తెలంగాణ రాష్ట్ర ముఖ చిత్రాన్ని తాము ఎలా మార్చామన్న విషయాన్ని సవివరంగా చెప్పే ఆలోచన మంచిదే. దీనికి ముందే ప్లాన్ చేయొచ్చు. అందుకు భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం జూన్ 1 రాత్రి అంటే మంగళవారం రాత్రి వేళలో భారీ ఎత్తున సమాచారం పంపిన వైనం మీడియా సంస్థలకు చుక్కలు చూపించింది.
కరోనా టైం కావటం.. సీఎంవో నుంచి మొయిల్ వచ్చి.. దాన్ని ఏ స్థాయిలో వార్తల రూపంలో అందించాలన్న నిర్ణయాన్ని తీసుకునే సమయానికే రాత్రి కావటం.. ఎడిషన్ టైంను పూర్తి చేయటానికి తక్కువ వ్యవధి ఉండటం.. వచ్చిన సమాచారం భారీగా ఉండటంతో కిందా మీదా పడిన పరిస్థితి. అప్పటికప్పుడు యుద్ధ ప్రాతిపదికన నిర్ణయం తీసుకోవటమే కాదు.. వాటిని అమలు చేయటానికి కిందా మీదా పడాల్సి వచ్చింది. మొత్తంగా తెలంగాణ సీఎంవో పుణ్యమా అని మీడియా సంస్థల్లో పని చేసే వారికి చుక్కలు కనిపించాయని చెప్పక తప్పదు.