తెలంగాణ కాంగ్రెస్ కూటమిగానా..? ఒంటరిగానా..?

Update: 2023-01-05 08:58 GMT
వచ్చే ఎన్నికల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎలా పోటి చేస్తుంది..? కూటమిగానా..? ఒంటరిగానా..? అనేది ఇప్పుడు కీలకంశంగా మారింది. తెలంగాణలో సార్వత్రిక ఎన్నికలకు మరెంతో కాలం లేదు. అటూ ఇటుగా మరో 10 నెలల్లో ప్రభుత్వం మారే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీతో పాటు ప్రతిపక్షాలు ఎన్నికల సమరానికి సిద్ధమవుతున్నాయి. ఇందులో భాగంగా కాంగ్రెస్ వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా ముందుకు వెళ్లాలి..? అనే కార్యాచరణ రూపొందించేందుకు సమాయత్తమవుతోంది. అయితే మిగతా పార్టీలు ఎవరికి వారే అన్నట్లుగా ఉన్నారు. సీపీఎం మినహా ఇతర పార్టీలతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ చీఫ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని అనుకుంటున్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. గత ఎన్నికల్లోనూ కొన్ని సీట్లు సాధించి పరువు నిలబెట్టుకుంది. అయితే కాంగ్రెస్ పార్టీతో  గెలిచిన వారిలో కొందరు బీఆర్ఎస్ లోకి వెళ్లారు.  మిగిలిన వారితో పాటు కేడర్  పార్టీ డెవలప్మెంట్ కోసం  తీవ్రంగా శ్రమిస్తున్నారు. అయితే పార్టీలో ఏర్పడిన అసంతృప్తుల కారణంగా పార్టీ పరిస్థితి ఆందోళనకంగా మారింది. సీనియర్లు, జూనియర్లు విడిపోయిన ఎవరికి వారే అన్న విధంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. పార్టీ చీఫ్ రేవంత్ రెడ్డిపై అసంతృప్తితో కొందరు ఆయన నిర్వహించే సమావేశాలకు గౌర్హాజరవుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా పోటీ చేస్తుంది..? అన్న సందేహం పార్టీ శ్రేణుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒంటరిగా కాకుండా ఇతర పార్టీలతో పొత్తు పెట్టుకునే అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.

సీపీఐ నాయకులకు ఇప్పటికే బీఆర్ఎస్ గాలం వేసింది. టీడీపీతో గతంలో పొత్తు పెట్టుకుంటే కలిసి రాలేదు. దీంతో మరోసారి ఆ మిస్టేక్ చేయొద్దనే ఒత్తిడి ఉంటుంది. ఇక కొత్తగా వచ్చిన వైఎస్సార్సీపీటీ పార్టీ నేత షర్మిల కూడా కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారు. పోనీ కొదండరాంను చేరదీస్తారా..? అంటే ఆయనకే ఓట్లు పడుతాయో లేదో..? అనే అనుమానాలున్నాయి.

ఈ నేపథ్యంలో ఒక్క సీపీఎంతో మాత్రమే అవకాశం ఉంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లోసీపీఎంను కలుపుకొని ప్రజల్లోకి వెళ్తే ప్రజల్లో మార్పు వస్తుందని అనుకోవడం లేదు. అందువల్ల రేవంత్ రెడ్డి ఒక్కోసారి ఒంటరిగానే కాంగ్రెస్ పోటీ చేస్తుందని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్, బీజేపీల మధ్యే టఫ్ ఫైట్ ఉంటుందని అనుకోవచ్చు. కానీ బీజేపీకి ఆశించినంత సీట్లు వస్తాయని ఎవరూ అనుకోవడం లేదు. ఈ తరుణంలో కాంగ్రెస్ కొన్ని ప్రాంతాలపై ప్రభావం చూపొచ్చు.

అయితే ఒంటరిగా ఎన్నికల్లోకి వెళ్తేనే అంతో ఇంతో పార్టీని ఆదరిస్తారని అంటున్నారు. మరో పార్టీతో  కలిసి వెళ్తే ఉన్న స్టాటజీ కూడా తగ్గుతుందని అంటున్నారు. అయితే పార్టీలో ఉన్న అసంతృప్తిని చల్లార్చడానికే రేవంత్ రెడ్డి ప్రయత్నాలు ఫలించడం లేదు. మరి ఒంటరిగా ఎన్నికల్లో వెళ్లి ఎలాంటి ప్రభావం చూపుతారోనని చర్చించుకుంటున్నారు. మరో 10 నెలల్లో పరిస్థితులు కాంగ్రెస్ కు అనుకూలంగా మారితే తప్ప పార్టీకి గడ్డుకాలం ఏర్పడే ప్రమాదం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News