తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో కొత్త చర్చ మొదలైంది. ఇంకా చెప్పాలంటే...ఉత్సాహంతో కూడిన టెన్షన్ మొదలైంది. ఓ వైపు పార్టీ బలోపేతం కోసం అంటూ గల్లీ స్థాయిలో బస్సుయాత్ర చేస్తున్నప్పటికీ...మనసంతా ఢిల్లీ వైపు లాగుతోంది. ఇందుకు కారణం...ఏఐసీసీలో పదవుల భర్తీ. ఏపీ నుంచి ఇద్దరు నేతలకు జాతీయస్థాయి పదవులు వరించడంతో తెలంగాణలో ఎవరికి వస్తాయనే సస్పెన్స్ తెలంగాణ నెలకొంది. ఏపీలో ఊహించిన వారెవరికీ పోస్టులు రాకపోవడంతో తెలంగాణలో కూడా అదే జరుగుతుందా అంటూ పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు.
కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ ఏఐసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత యువతకు - మహిళలకు పెద్ద పీట వేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. దీన్ని నిజం చేస్తూ రాహుల్ ఎవరి ఊహలకు అందకుండా పదవులు ఇస్తుండం నేతల్లో గుబులు పుట్టిస్తోంది. తాజాగా ఆంద్రప్రదేశ్ నుంచి మాజీ ఎమ్మెల్సీ గిడుగు రుద్రరాజు - మాజీ ఎమ్మెల్యే షేక్ మస్తాన్ వలిని ఏఐసీసీ కార్యదర్శులుగా నియమించారు. ఒరిస్సా కాంగ్రెస్ వ్యవహారాల బాధ్యతలను కూడా వీరిద్దరికి అప్పగించారు.ఏపీలో ఎవరూ అంచనా వేయని విధంగా రుద్రరాజు - మస్తాన్ వలికి ఏఐసీసీ కార్యదర్శుల వంటి కీలక బాధ్యలు అప్పగించారు. ఈ పరిణామం ఏపీ కాంగ్రెస్ నేతల్లో చర్చనీయాంశం అయింది.
అయితే ఇదే ఎపిసోడ్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు సైతం ఆసక్తిగా గమనిస్తున్నారు. పక్క రాష్ట్రంలో ఏఐసీసీ పదవుల నియామకాలు ప్రారంభం అవ్వడంతో తెలంగాణలో కూడా రేపో మాపో పంపకాలు ఉంటాయని నేతలు ఎదురు చూస్తున్నారు. తెలంగాణకు కూడా రెండు ఏఐసీసీ కార్యదర్శి పదవులు దక్కవచ్చని భావిస్తున్నారు. అలాగే ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి పదవితో పాటు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో కూడా తెలంగాణకు చోటు దక్కే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ కోటాలో వచ్చే జాతీయ స్థాయి పదవుల కోసం నేతలు ఇప్పటికే లాబీయింగ్ ప్రారంభించారు. మరి లాబీయింగ్ చేస్తున్న వారికి ఏఐసీసీ పదవులు దక్కుతాయా..లేదంటే తెలంగాణ నేతల ఎంపికలో కూడా రాహుల్ తన మార్క్ చూపిస్తారా అనే చర్చ పార్టీ వర్గాల్లో సాగుతోంది. పేరుకు బస్సు యాత్ర చేస్తున్నప్పటికీ...పార్టీ నేతల ఆలోచన అంతా ఢిల్లీ పెద్దల నిర్ణయంపై ఉందంటున్నారు.