తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కుతున్నాయి. ఓవైపు టీఆర్ ఎస్ పార్టీ అధినేత - ముఖ్యమంత్రి కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు ప్రకటించి కొత్త చర్చకు తెరలేపగా...ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం తానేం తక్కువ కాదన్నట్లు ఎన్నికల వ్యూహాన్ని అమల్లో పెట్టింది. రాజ్యసభ ఎన్నికల్లో అభ్యర్థిని పోటీలోకి దించాలని కాంగ్రెస్ శాసనసభా పక్షం(సీఎల్పీ) నిర్ణయించింది. ఈ నిర్ణయంపై పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతుండటం గమనార్హం. మరోవైపు ఈ పోటీ ద్వారా కాంగ్రెస్ కసి తీర్చుకుంటుందా లేదా కామెడీ పాలు అవుతుందా చూడాలని అంటున్నారు.
తెలంగాణలో మొత్తం మూడు స్థానాలకు ఈ నెల 23న రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి.ఈ నెల 12 వరకు నామినేషన్లు దాఖలు చేయవచ్చు. 13న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్లు ఉపసంహరణకు గడువు 15 వరకు ఉంది. 23న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటలకు పోలింగ్ జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 5 గంటలకు ఓట్లను లెక్కించి ఫలితాలు విడుదల చేస్తారు. ఈ ఎన్నిక - అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో సీఎల్పీ నేత కె.జానారెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ శాసనసభా పక్షం సమావేశమైంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ ఆర్ సీ కుంతియా - శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ - పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి - కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క - పార్టీ ఎమ్మెల్యేలు - ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని పోటీలో పెట్టడంపై ప్రధానంగా చర్చించారు. పోటీ పెట్టాల్సిందేనని పలువురు నేతలు వ్యాఖ్యానించగా..మరికొందరు విబేధించారు. పోటీ పెట్టడం వల్ల గెలిచే పరిస్థితి లేదని, పోటీలోకి దిగడం అనవసరమని కొందరు వాదించారు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు చెక్ పెట్టినట్టుగా ఉంటుందని, టీఆర్‌ఎస్ ఫిరాయింపు రాజకీయాలను ఎండగట్టడానికి ఉపయోగపడుతుందనే నిర్ణయానికి సీఎల్పీ వచ్చింది. ఈ నేపథ్యంలో సరైన అభ్యర్థిని పోటీలోకి దించాలని నిర్ణయించింది. రాజ్యసభకు అభ్యర్థిని బరిలో దించాలని నిర్ణయించిన కాంగ్రెస్ దీటైన అభ్యర్థి కోసం అన్వేషిస్తోంది. మాజీ ఎంపీ రవీంద్రనాయక్ - మాజీ ఎంపీ - క్రికెటర్ అజహరుద్దీన్ - పీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్లు పార్టీ వర్గాల సమాచారం.
కాగా, ఆపరేషన్ ఆకర్ష్ ద్వారా తనను బలహీనపర్చిన అధికార టీఆర్ఎస్ పార్టీని ఎదురుదెబ్బ తీసేందుకే కాంగ్రెస్ పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు సమాచారం. అవసరమైతే విప్ జారీ చేయించి టీఆర్ఎస్‌లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడేలా చేయాలని కాంగ్రెస్ నాయకులు భావిస్తున్నారు. ఒకవేళ ఇదే జరిగితే టీఆర్ఎస్‌కు ఝలక్ తగిలినట్లే. అయితే ఇందుకు తక్కువ చాన్స్ ఉందంటున్నారు. అనర్హతపై గతంలో ఇచ్చిన ఫిర్యాదులే పెండింగ్‌లో ఉన్నాయని...ఇక తాజా ఫిర్యాదులపై చర్యలు ఎలా ఉంటాయని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తంగా కాంగ్రెస్ కసి తీర్చుకుంటుందా...బలం లేకున్నా పోటీకి నిలిపి కామెడీ పాలవుతుందా త్వరలో తేలుతుందంటున్నారు.