తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు హస్తం పార్టీకి గట్టి షాక్ ఇచ్చేలా కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కల్లేనని ఇప్పటికే తేలిపోయింది. కనీసం పార్టీలో సీఎం అభ్యర్థులుగా చెప్పుకున్న సీనియర్ నేతలైనా ఎమ్మెల్యేలుగా విజయం సాధిస్తారా? లేదా? అన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. వారంతా ప్రస్తుతం తమ తమ స్థానాల్లో వెనుకంజలో ఉన్నారు.
ప్రజా కూటమి గెలిస్తే సీఎం అయ్యే అవకాశాలున్న కాంగ్రెస్ నేతలుగా మాజీ సీఎల్పీ లీడర్ జానా రెడ్డి - మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా - పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్ రెడ్డి - సీనియర్ నేత మల్లు భట్టి విక్రమార్క - ఫైర్ బ్రాండ్ డి.కె.అరుణ పదే పదే వార్తల్లోకెక్కారు. వీరంతా తొలి రౌండ్లలో తమ సీట్లలో ప్రత్యర్థుల కంటే వెనుకబడి ఉండటం గమనార్హం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రం తొలి రౌండ్స్ లో ముందంజలో కనిపిస్తూ ఉన్నారు. ఆయన భార్య పద్మావతి వెనుకంజలో ఉన్నారు.
ఇక మాజీ మంత్రి కొండా సురేఖపై టీఆర్ ఎస్ అభ్యర్థి చల్లా ధర్మారెడ్డి స్పష్టమైన ఆధిక్యంలో ఉన్నారు. మరోవైపు - జగిత్యాలలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి ఇప్పటికే పరాజయం పాలయ్యారు. టీఆర్ ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ ఆయనపై విజయం సాధించారు.