తెలంగాణ టీడీపీ నేత...కాంగ్రెస్ పార్టీతో అనూహ్యరీతిలో శృతిమించిన సఖ్యతను కొనసాగిస్తున్న ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి...ఎపిసోడ్ కలకలం ఊహించని రీతిలో ముందుకు సాగుతుంది. రేవంత్ తమ పార్టీకి గుడ్ బై చెప్పే పరిణామాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేక పోతుండగా...ఈ ఎపిసోడ్ తమకు ఎసరు పెట్టేలా మారిందని కాంగ్రెస్ పార్టీలోని కొందరు సీనియర్లు మథనపడుతున్నట్లు తెలుస్తోంది. రేవంత్ వస్తే...పార్టీ బలోపేతం అవుతుందని పైకి భావిస్తున్నప్పటికీ లోలోపల మథనపడుతున్నట్లు చెప్తున్నారు.
రేవంత్ కాంగ్రెస్ లో చేరితే తమకు ప్రాధాన్యత తగ్గే అవకాశాలు లేకపోలేదని మాజీ మంత్రులు - మాజీ ఎమ్మెల్యేలు - ఇతర ముఖ్యనేతలు - నియోజకవర్గ ఇన్ ఛార్జులు టెన్షన్ పడుతున్నారని చర్చ జరుగుతోంది. రేవంత్ సహా ఆయన పార్టీకి చెందిన నేతలు పార్టీలోకి వస్తే నియోజకవర్గాలు, ఎమ్మెల్యే టికెట్లు వంటివి ఇబ్బందికరంగా మారుతాయని అంచనా వేస్తున్నారు. చోటామోటా నేతలు - నియోజకవర్గ ఇన్ ఛార్జులకే కాదు సీనియర్ లీడర్లకు కూడా భయం పట్టుకుందని అంటున్నారు. రేవంత్ రెడ్డి పార్టీలో చేరితే కాంగ్రెస్ కే మంచిదని కొందరు వాదిస్తుంటే కొత్తగా వచ్చే వారికి పదవులు ఇస్తే ఊరుకునేది లేదని మరికొందరు అధిష్ఠానాన్ని హెచ్చరిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో నిందితుడిగా ఉన్న రేవంత్ పార్టీలోకి వస్తే ఆ మచ్చ కాంగ్రెస్ కు అంటుకుంటుందని వాదిస్తున్నారు. ఈ భావనతోనే రేవంత్ విషయంలో ఇప్పటికే రెండు వర్గాలుగా విడిపోయినట్లు సమాచారం.
కాగా, రేవంత్ రెడ్డి చేరికపై తనకేమీ తెలియదని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పార్టీ బలోపేతానికి తీసుకునే ఏ చర్యలకైనా తాను మద్దతిస్తానని తెలిపారు. పార్టీకి చెందిన అనే సీనియర్ ఎమ్మెల్యే చిన్నారెడ్డి కూడా రేవంత్ రాకను స్వాగతించారు. తమ పదవులకు గండం అనుకునే వాళ్లే రేవంత్ రెడ్డి రాకను వ్యతిరేకిస్తున్నారని చిన్నారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ సీనియర్ నేత - మాజీ ఎంపీ వీహెచ్ ఇంకో అడుగు ముందుకు వేశారు. రేవంత్ ను కాంగ్రెస్ లో చేరాలని తానే సూచించానన్నారు. కాంగ్రెస్ లో చేరితే రేవంత్ తో పాటు పార్టీకి కూడా లాభం చేకూరుతుందన్నారు. మొత్తంగా రేవంత్ ఎంట్రీకంటే ముందే...కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలిందని అంటున్నారు.