వరుస ఎదురుదెబ్బల అనంతరం వచ్చే సక్సెస్ ఇచ్చే సంతోషం ఎంతన్నది కర్ణాటక కాంగ్రెస్ నేతల్ని చూస్తే అర్థమవుతుంది. ఒక బలమైన రాష్ట్ర పగ్గాలు సాధించాలన్న కోరిక కాంగ్రెస్ కు తీరింది. గడిచిన కొన్నేళ్లుగా విజయావలకు దూరంగా.. ఓటములకు దగ్గర అవుతున్న వేళ.. గ్రూపుల్ని.. పంచాయితీల్ని పక్కన పెట్టి మూకుమ్మడిగా కలిసి పోరాడిన దానికి బదులుగా కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని సాధించింది.
కర్ణాటక ఎన్నికల సందర్భంగా టికెట్ల పంపిణీ విషయంలో తాము అమలు చేసిన ఫార్ములాను.. తాజాగా తెలంగాణలోనూ అమలు చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. కర్ణాటక తరహాలోనే తెలంగాణలోనూ టికెట్లను కేటాయించాలన్న అభిప్రాయం పార్టీ అధినాయకత్వంలో ఉన్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో బలమైన ఓటు బ్యాంకు ఉన్న బీసీలను ఒక తాటి మీదకు తీసుకురావటం.. వారిని తమవైపునకు తిప్పుకునేలా చేయగలిగితే.. తెలంగాణ ఎన్నికల్లో విజయం సాధించటం పెద్ద కష్టం కాదన్న మాట వినిపిస్తోంది.
తెలంగాణలో బీసీ వర్గాల ఓటు బ్యాంకు భారీగా ఉన్నా.. వారి మధ్య ఉన్న అనైక్యత.. కలిసి కట్టుగా ఓటును ఒక పార్టీకి వేయాలన్న దానిపై ఏకాభ్రిప్రాయం లేని నేపథ్యంలో.. వారందరిని ఒక తాటి మీదకు తీసుకురావాలన్నది కాంగ్రెస్ ఆలోచనగా చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో బీసీ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలన్న యోచనలో పార్టీ ఉన్నట్లుగా చెబుతున్నారు.
టికెట్ల కేటాయింపుతో సరిపెట్టకుండా పార్టీ విధానాల విషయంలో బీసీలకు పెద్ద పీట వేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది. విద్య.. ఉద్యోగ రంగాల్లో బీసీ వర్గాల రిజర్వేషన్లను 40 శాతానికి పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. ఇదే అంశాన్ని పార్టీ ఎన్నికల హామీ ప్రకటనలోనూ చేరుస్తారని చెబుతున్నారు. కర్ణాటక తరహాలోనే జనాభా ప్రాతిపదికన టికెట్ల కేటాయింపులు జరుగుతాయని చెబుతున్నారు. ఈసారి ఎన్నికల్లో బీసీలకు 50 శాతం టికెట్లు ఇవ్వాలన్న అంశం ప్రధాన అంశంగా మారుతుందని అంచనా వేస్తున్నారు.
గడిచిన రెండు దఫాల్లో కేసీఆర్ సర్కారు చేసిన భారీ అప్పుల్ని ప్రధానంగా ప్రచారం చేయటంతో పాటు.. ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు.. తెలంగాణ సెంటిమెంట్ ను కూడా వినియోగించుకోవలని భావిస్తున్నారు. లోక్ సభలో తెలంగాణ బిల్లును ఆమోదం పొందిన రోజున జరిగిన నాటకీయ పరిణామాలు.. ఆ రోజున కాంగ్రెస్ ఎంపీల పాత్ర.. బీఆర్ఎస్ ఏమీ చేయని వైనాన్ని తెలిపే వీడియోలను రూపొందించి.. గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రచారం చేయాలన్న యోచనలో ఉన్నట్లు చెబుతున్నారు.
సీఎల్పీ నాయకుడు భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్స్ పాదయాత్ర ప్రస్తుతం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో సాగుతున్న విషయం తెలిసిందే. ఒకట్రెండు రోజుల్లో ఆ జిల్లా నుంచి నల్గొండ జిల్లాలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో.. నల్గొండ జిల్లాలో భట్టి పాదయాత్ర సాగే సమయంలో నల్గొండ.. సూర్యపేట రెండుచోట్ల భారీ సభల్ని ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. అంతేకాదు ఈ నెల 20-25 మధ్య ఖమ్మంలో భారీ సభను నిర్వహించాలని.. దీనికి ప్రియాంక గాంధీని ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఆమె నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చేయటంతో ఆ దిశగా ఏర్పాట్లను చేస్తున్నారు.