తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇదే సమయంలో అధికార-ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం సైతం జరుగుతోంది. ఇలాంటి తరుణంలో న్యాయస్థానాల్లో పిటిషన్లు సైతం నమోదు అవుతున్నాయి. తాజాగా కరోనా టెస్టులు, ఆస్పత్రుల్లో చికిత్స సహా పలు పిటిషన్లపై హైకోర్టు ఏక కాలంలో విచారణ జరిపింది. చీఫ్ సెక్రటరీ, హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీ, డిహెచ్ఎంవో, జిహెచ్ఎంసి కమిషనర్ హాజరయ్యారు. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తొలిసారిగా విచ్చేసిన ఈ విచారణలో తెలంగాణాలో కరోనా పరిస్థితులపై హైకోర్టు ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది. పలు అంశాల్లో తన ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నా నివారణ, నియంత్రణ ఎందుకు చేపట్లేదని అధికారులను హైకోర్టు ప్రశ్నించింది. హైదరాబాద్ నుండి మారుమూల ప్రాంతాలకు కూడా కరోనా విస్తరించిందని మారుమూల ప్రాంతాల్లో కూడా వైరస్ సోకి ప్రజలు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసిన హైకోర్టు కరోనా నియంత్రణకు తీసుకున్న చర్యలేంటని ప్రశ్నించింది. ఇతర రాష్ట్రాల్లో టెస్టులు భారీగా చేస్తున్నప్పటికీ, తెలంగాణలో ఎందుకు తక్కువగా చేస్తున్నారని అడిగింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో వసతులపై కోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆక్సీజన్ అందక 38 మంది చనిపోయారని కోర్టు పేర్కొంది. కరోనా బులిటెన్‌లో తప్పుల తడకలేంటి అంటూ అధికారులను కోర్టు ప్రశ్నించింది. ప్రైవేటు హాస్పిటల్ వారు విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని కోర్ట్ ప్రశ్నించింది. రాష్ట్రంలో ఎన్ని బెడ్స్ ఉన్నాయి... ఎన్ని వెంటిలెటర్స్ ఉన్నాయి.. ఎంత మంది చికిత్స పొందుతున్నారు...అనే సమాచారం ఇవ్వాలని కోరింది. తమ ఆదేశాలను ఎందుకు పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.
ప్రజలకు సమాచారం అందించాలని హైకోర్టు చెప్పినా ఎందుకు పాటించడం లేదని హైకోర్టు ప్రశ్నించింది. కరోనా పై ప్రభుత్వం ఎందుకు విస్తృత ప్రచారం చేపట్టడం లేదని కోర్ట్ ప్రశ్నించింది. ప్రతి హాస్పిటల్ వద్ద ఎలక్ట్రానిక్ బోర్డ్ ఏర్పాటు చేయాలని సూచించింది. యాప్ లు విడుదల చేయడం వలన సామాన్య ప్రజలకు అర్ధం కాదని కోర్ట్ తెలిపింది. రాష్ట్రంలో రాపిడ్ కిట్ల వాడకం పై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని హై కోర్టు ఆదేశించింది. పత్రికల్లో ప్రతి రోజు న్యూస్ ఏజెన్సీ ద్వారా ప్రజలకు కరోనా సమాచారం తెలపాలంది. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ కు ఏ విధంగా పట్టిక వేసి చూపుతారో అదే తరహాలో కేసుల వివరాలు చూపాలని ఆదేశించింది.
ధర్మాసనం వివిధ అంశాలపై వ్యక్తం చేసిన అభిప్రాయాల నేపథ్యంలో సీఎస్ వివరణ ఇచ్చారు. కోర్టు ఆదేశాల మేరకు ప్రతిరోజు సమాచారం ఇస్తామని సీఎస్ తెలిపారు. ఈ మేరకు సమాచార హక్కు కమిషనర్ అరవింద్ కు సీఎస్ ఆదేశాలు జారీ చేసారు. డబ్యూహెచ్ఓ, ఐసీఎంఆర్ గైడ్ లైన్స్ ప్రకారమే మూడున్నర లక్షలకు పైగానే టెస్టులు చేశామని సీఎస్ కోర్టుకు తెలియజేశారు.
ప్రస్తుతం రాష్ట్రంలో2 లక్షల రాపిడ్ కిట్లు వాడకంలో ఉన్నాయని సీఎస్ తెలిపారు. మరో 4 లక్షల కిట్లు ఆర్డర్ చేశామన్నారు. ప్రైవేట్ హాస్పిటల్ ల ఆగడాలపై ఇప్పటి వరకు 726 ఫిర్యాదులు అందాయని సీఎస్ తెలిపారు. ప్రైవేటు హాస్పిటల్ విపరీతంగా ఫీజులు వసూలు చేస్తున్న అంశంపై ప్రభుత్వం ఇప్పటికే కొన్ని హాస్పిటల్స్ కు నోటిసులు ఇచ్చిందని సీఎస్ తెలిపారు. తదుపరి నివేదిక లో ఆ 726 ఫిర్యాదులు పై ప్రైవేట్ హాస్పిటల్ ల పై ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలపాలని కోర్టు సూచించింది. తదుపరి విచారణ ను ఆగస్ట్ 13 కు వాయిదా వేస్తూ కోర్ట్ నిర్ణయం తీసుకుంది. కాగా, సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కోర్టుకు వచ్చి వివరణ ఇవ్వడం, న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది.