ఇకపై.. తెలంగాణ రాష్ట్ర చేప అదే

Update: 2016-07-20 16:19 GMT
తెలంగాణ రాష్ట్ర సర్కారు.. రాష్ట్ర చేపగా కొర్రమీనును ఎంపిక చేసింది. కొర్రమీనుకు రాష్ట్ర చేప హోదా కట్టబెడుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. గత ఏడాదిగా రాష్ట్ర చేపగా దేన్ని ఎంపిక చేయాలన్న అంశంపై విస్తృతంగా కసరత్తు చేసిన కేసీఆర్ సర్కారుకు చివరకు ఆ హోదాను కొర్రమీనుకు కట్టబెడుతూ నిర్ణయం తీసుకుంది. ఈ చేపలో ఔషద విలువలు ఉండటం.. తెలుగు రాష్ట్రాలతో పాటు.. చుట్టుపక్కల అన్ని రాష్ట్రాల్లోనూ బత్తిన సోదరులు ఇచ్చే చేప ప్రసాదంలోనూ కొర్రమీనును ఉపయోగిస్తున్న నేపథ్యంలో.. ఈ చేపను తెలంగాణ రాష్ట్ర చేపగా ఎంపిక చేశారు.

రాష్ట్ర విభజన జరిగిన తర్వాత.. తెలంగాణ రాష్ట్ర పక్షిగా పాలపిట్ట.. తెలంగాణ రాష్ట్ర పుష్పంగా తంగేడు.. రాష్ట్ర పండుగా మామిడి.. రాష్ట్ర వృక్షంగా జమ్మిచెట్టు.. రాష్ట్ర క్రీడగా కబడ్డీ.. రాష్ట్ర జంతువుగా కృష్ణ జింకగా ప్రకటించిన సర్కారు.. తాజాగా రాష్ట్ర చేపగా కొర్రమీనును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Tags:    

Similar News