తెలంగాణ‌లో తుది ఓట‌ర్ల లెక్క తేలింది

Update: 2018-10-13 07:25 GMT
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి కీల‌క‌మైన తుది ఓట‌ర్ల జాబితా లెక్క ఒక కొలిక్కి వ‌చ్చింది. ఓట‌ర్ల స‌వ‌ర‌ణ‌కు ముందు.. త‌ర్వాత అన్న లెక్క‌ల్ని తేల్చిన అధికారులు.. తుది జాబితాను సిద్ధం చేశారు. శుక్ర‌వారం రాత్రి 11 గంట‌ల వేళ‌లో కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓట‌ర్ల తుది జాబితాను పంపారు. దీనికి అర్థ‌రాత్రి 12.30గంట‌ల ప్రాంతంలో ఆమోద‌ముద్ర వేస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకుంది.

తాజాగా ఆమోదం పొందిన ఓట‌ర్ల జాబితా ప్ర‌కారం చూస్తే.. 2018 జ‌న‌వ‌రి నాటికి ఉన్న ఓట‌ర్ల జాబితాలో పోలిస్తే.. కొత్త‌గా 11,18,827 మంది కొత్త ఓట‌ర్లు త‌మ పేర్ల‌ను న‌మోదు చేసుకున్నారు. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా ఆమోదం పొందిన జాబితాల‌ను ఆన్ లైన్ ద్వారా పంపారు.   

మొద‌ట అనుకున్న ప్ర‌కారం తుది ఓట‌ర్ల జాబితాను ఈ నెల 8న ప్ర‌క‌టించాల్సి ఉంది. అయితే.. కోర్టులో కేసుల కార‌ణంగా జాబితా విడుద‌ల‌ను నిలిపివేశారు. మార్పులు చేర్పుల‌కు నాలుగు రోజుల గ‌డువు పొడిగిస్తూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం నిర్ణ‌యం తీసుకోవ‌టం.. అందుకు కోర్టు ఓకే చెప్ప‌టంతో  ఎన్నిక‌ల సంఘం అధికారులు తుది క‌స‌ర‌త్తు షురూ చేశారు. దీంతో.. గ‌డువు రోజైన శుక్ర‌వారం నాటికి జాబితా రెఢీ అయ్యింది. అయితే.. సాఫ్ట్ వేర్ ఇబ్బందుల కార‌ణంగా శుక్ర‌వారంరాత్రి 8 గంట‌ల వ‌ర‌కూ తుది జాబితాను కేంద్ర ఎన్నిక‌ల సంఘానికి తెలంగాణ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పంప‌లేక‌పోయింది.

ఈ కార‌ణంతోనే శుక్ర‌వారం అర్థరాత్రి 12.30 గంట‌ల వేళ‌లో తుది జాబితాకు కేంద్ర ఎన్నిక‌ల సంఘం ఓకే చెప్పేసింది. ఓట‌ర్ల జాబితాలో భారీగా ఓట్ల‌ను తొల‌గించారంటూ కోర్టులో కేసులు న‌మోదు కావ‌టంతో తుది జాబితా విష‌యంలో ఆచితూచి అన్న‌ట్లుగా జాగ్ర‌త్త‌లు తీసుకున్నారు. జాబితాలో త‌ప్పులు దొర్లి.. ఎవ‌రైనా కోర్టుకు ఆశ్ర‌యిస్తే ఎన్నిక‌లకు సంబంధించి ఇబ్బందిక‌ర ప‌రిస్థితులు నెల‌కొంటాయ‌న్న ఉద్దేశంతో ఎన్నిక‌ల సంఘ అధికారులు జాగ్ర‌త్త‌గా జాబితాను సిద్ధం చేసిన‌ట్లుగా తెలుస్తోంది.

బోగ‌స్ ఓట్ల‌ను గుర్తించేందుకు వీలుగా ఈఆర్వో నెట్ పేరుతో ప్ర‌త్యేక సాఫ్ట్ వేర్ రూపొందించి.. వ‌డ‌బోత కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టారు. ఒకే పేరుతో.. ఒకే కార్డుతో ఉన్న వారితో స‌హా.. మ‌ర‌ణించిన వారి ఓట్ల‌ను తొల‌గించేందుకు వీలుగా కొత్త సాఫ్ట్ వేర్ సాయంతో గుర్తించారు. అలా గురించిన వారిలో 2,68,365 ఓట్లర్లు ఇప్ప‌టికే మ‌ర‌ణించార‌ని తేల్చారు. వారి పేర్ల‌ను జాబితా నుంచి తొల‌గించారు. తుది జాబితా ప్ర‌కారం తెలంగాణ వ్యాప్తంగా ఫైన‌ల్ గా లెక్క తేలిన ఓట‌ర్ల లెక్క చూస్తే..

+ పురుషులు: 1,37,87,920
+ మ‌హిళ‌లు :  1,35,28,020
+ థ‌ర్డ్ జెండ‌ర్‌:           2,663
+ స‌ర్వీసు ఓట‌ర్లు:      9,451
+ మొత్తం ఓట‌ర్లు: 2,73,28,054
Tags:    

Similar News