మంచి ఎక్కడున్నా వెంటనే పసిగట్టి.. ఆ విధానాల్ని అనుసరించేలా వ్యవస్థలో మార్పులు చేయటం అంత తేలికైన విషయం కాదు. పెద్ద ఎత్తున పరిశీలన.. అంశాలపై అవగాహన ఉన్న వారు మాత్రమే అలా చేయగలుగుతారు. తమ చుట్టూ ఉన్న ప్రపంచంలో చోటుచేసుకుంటున్న మార్పుల్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ.. వాటిల్లో అత్యుత్తమ అంశాల్ని అందిపుచ్చుకునే ధోరణి చాలా తక్కువ మంది ముఖ్యమంత్రుల్లో మాత్రమే కనిపిస్తుంది. మిగిలిన అంశాలు ఎలా ఉన్నా.. కొత్త కొత్త ధోరణుల్ని.. మంచి సంప్రదాయాల్ని గుర్తించి.. వాటిని పాలో అయ్యే విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుంటారు. విషయాల మీద మంచి పట్టుతో పాటు.. వ్యవస్థలోని లోపాల్ని వీలైనంతగా తగ్గించి.. మెరుగైన పాలనను అందించాలన్న కృతనిశ్చయం కేసీఆర్ లో ఎక్కువనే చెప్పాలి. ముఖ్యమంత్రిగా క్షణం తీరిక లేని సమయంలోనూ పుస్తకాలు చదవటం.. కొత్త అంశాలపై అవగాహన పెంచుకునే వైఖరి కేసీఆర్ లో ఎక్కువే. ఇలాంటి వైఖరిని ఆయన తాజాగా మరోసారి ప్రదర్శిస్తున్నారు.
తీవ్రస్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తే రిజిస్ట్రేషన్ల శాఖను ప్రక్షాళన చేసి.. తప్పులన్నవి జగరకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ సర్కారు దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా తాజా సరికొత్త విధానాల మీద దృష్టి పెట్టింది. ఇంతవరకూ లేని విధంగా ఇప్పుడే ఇంత కసరత్తు ఎందుకన్న సందేహం రావొచ్చు. నిజమే..దీనికి సముచితమైన కారణం లేకపోలేదు. ఇప్పటికే రిజిస్ట్రేషన్లకు సంబంధించి పలు వివాదాలు తెర మీదకు రావటం.. మోసాలు.. లోపాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి వాటికి చెక్ చెప్పాలనీ టీఆర్ ఎస్ సర్కారు భావిస్తోంది. దీనికి తోడు మరికొద్ది రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్త జిల్లాలు వస్తున్న నేపథ్యంలో.. జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్ల జోరు మరింత పెరిగింది. ఇప్పటికే అక్రమ లే అవుట్లు పెద్ద ఎత్తున వచ్చేస్తున్న పరిస్థితి. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో భూముల ధరలు భారీగా పెరుగుతాయన్న అంచనాల నేపథ్యంలో.. ఎవరికి వారు వీలైనంత భూమిని కొనుగోలు చేసే ప్రయత్నం జోరందుకుంది.
ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్లలో చోటు చేసుకునే మోసాలకు చెక్ పెట్టేందుకు కేసీఆర్ సర్కారు..మహారాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని అమలు చేస్తే ఎలా ఉంటుందన్న అంశంపై దృష్టి పెట్టింది. మహారాష్ట్రలోని రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ మొత్తాన్ని వీడియో రికార్డు చేస్తారు. రిజిస్ట్రేషన్ కు సంబంధించి ఆయా వ్యక్తులు ఆఫీసుల్లోకి రావటం మొదలు.. వారు వేలిముద్రలు వేయటం.. సంతకాలు చేయటంలాంటివి షూట్ చేస్తారు. సరిగ్గా ఇదే విధానాన్న తెలంగాణ వ్యాప్తంగా అమలు చేస్తే ఎలా ఉంటుందని కేసీఆర్ సర్కారు ఆలోచిస్తోంది.ఇందులో భాగంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. సీసీ కెమేరాల ఏర్పాటుతో మొత్తం రిజిస్ట్రేషన్ ప్రక్రియ మూడో కన్ను సాక్షిగా జరిగిపోతుందని భావిస్తున్నారు. ప్రస్తుతం పరిశీలనలో ఉన్న ఈ వ్యవహారాన్ని ఆచరణలోకి తీసుకొస్తే రిజిస్ట్రేషన్ మోసాలకు చెక్ పెట్టే అవకాశం ఉండటమే కాదు.. న్యాయపరమైన వివాదాల్ని మరింత త్వరగా పరిష్కరించే వీలు ఉంటుందన్న భావన వ్యక్తమవుతోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/