పేదలను తెలంగాణ సర్కార్ ఆదుకోవడం లేదు: షర్మిల

Update: 2021-06-25 13:30 GMT
పేదవాళ్ల కోసం వైఎస్ ఆరోగ్యశ్రీ పథకం తెచ్చారని.. నా తండ్రిది పెద్ద మనసు అని వైఎస్ షర్మిల పేర్కొన్నారు. కార్పొరేట్ ఆస్పత్రిలో కూడా ఉచిత వైద్యం అందించారని.. అంతకుముందు ఒక్క నాయకుడు కూడా ఇలా ఆలోచించలేదని అన్నారు. కుటుంబాలను నిలబెట్టిన పథకం ఆరోగ్యశ్రీ అన్నారు.

తెలంగాణలో ఆరోగ్యశ్రీ అందడం లేదని.. కరోనా రోగాన్ని ఆరోగ్యశ్రీలో ఎందుకు చేర్చలేదు అని వైఎస్ షర్మిల ఆరోపించారు. పేదవాళ్లను తెలంగాణ సర్కార్ ఆదుకోవడం లేదు అని అన్నారు.

ఫాంహౌస్ నుంచి బయటకు వస్తే నిజాలు తెలుస్తాయని వైఎస్ షర్మిల ఆరోపించారు. ఆరోగ్యశ్రీలో కరోనా చేర్చాలని అన్నారు. ఆయుష్మాన్ భారత్ అమలు చేస్తే లాభం లేదన్నారు.

కేసీఆర్ మాత్రం యశోధ ఆస్పత్రికి వెళ్లారని.. పేదవారు మాత్రం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లాలా? అని వైఎస్ షర్మిల నిలదీశారు. మీకో న్యాయం పేదవారికి మరో న్యాయమా? అని మండిపడ్డారు. చెల్లెళ్ల కన్నీళ్లకు విలువ లేదా? అని అడిగారు. అలాగే ప్రస్తుత సమయంలో కోవిడ్ తో చనిపోయిన వారికి ఐదు లక్షలు ఇవ్వాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు.
Tags:    

Similar News