తెలంగాణలో కరోనా మహమ్మారి స్వైరవిహారం చేస్తుంది. కరోనా మహమ్మారిని కట్టడిలోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నా కూడా కరోనా రాష్ట్రంలో కంట్రోల్ అవ్వడంలేదు. ఈ మద్యే ప్రభుత్వం రాష్ట్రంలో కరోనా టెస్టులని భారీగా పెంచింది. అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో కరోనా బాధితులకు ఉచితంగా వైద్యం అందించాలని ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా మొదట మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో ఉచితంగా కరోనా టెస్టులతో పాటు చికిత్స అందించనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వెల్లడించింది.
తాజాగా, రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న కరోనా రోగుల డైట్ చార్జీలను కూడా ప్రభుత్వంపెంచుతున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో ఇప్పటి వరకు కరోనా బాధితులకు అందిస్తున్న భోజనానికి రోజుకు సాధారణ డైట్ కు రూ.40, హైప్రొటీన్ డైట్ కు రూ.56 చొప్పున ప్రభుత్వం డబ్బు అందిస్తుంది. అయితే కరోనా ఆస్పత్రిగా మార్చిన తర్వాత కరోనా పేషెంట్లకు మంచి పౌష్టిక ఆహారాన్నిఅందిస్తున్నారు. దీనికోసం కరోనా పేషేంట్స్ డైట్ చార్జీని రూ.275కు పెంచారు. హైదరాబాద్ లోని వివిధ ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా రోగులకు మాత్రమే ఈ డైట్ చార్జీ వర్తిస్తుంది. అలాగే , జిల్లాల్లో ఈ డైట్ చార్జీల్లో రూ.200గా నిర్ణయించారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు ప్రభుత్వం మరో రెండు రోజుల్లో విడుదల కానున్నట్లు అధికార వర్గాల సమాచారం.
ప్రస్తుతం గాంధీలో కరోనా పేషెంట్లకు అందించే మెనును ఒకసారి చూస్తే ...
ఉదయం 7 గంటలకు – బ్రెడ్, పాలు..
ఉదయం 8 గంటలకు- అల్పాహారంగా ఉప్మా, ఇడ్లీ, వడ, పూరి-వీటిలో ఎదో ఒకటి
మధ్యాహ్నం 12 గంటల : భోజనంలో కూర, పప్పు, సాంబారు, గుడ్డు, హైప్రొటీన్ గింజలు, సీ విటమిన్ పండు, వాటర్ బాటిల్
మధ్యాహ్నం 3గంటలకు – టీ, బిస్కెట్లు
సాయంత్రం 4 గంటలకు 100 గ్రాముల డ్రై ఫ్రూట్స్
రాత్రి గం.7.30 భోజనం, చపాతి, పుల్కా, అన్నం, కూర, రసం, పెరుగు, ఒక వాటర్ బాటిల్
రాత్రి 9 గంటలకు – గ్లాసు పాలు, పండ్లు