తెలుగు స‌భ‌ల ఫుడ్ మెనూ అదిరింది కేసీఆర్‌

Update: 2017-12-13 07:55 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ లో ఒక విల‌క్ష‌ణ‌త ఉంది. ఆయ‌న ఎప్పుడు ఎవ‌రిని ఇంటికి భోజ‌నానికి పిలుస్తారో తెలీదు. కానీ.. పిలిస్తే మాత్రం కేసీఆర్ ట్రీట్ మెంట్ ను జ‌న్మ‌లో మ‌ర్చిపోలేరు. కొస‌రి కొస‌రి వ‌డ్డించ‌టంతో పాటు.. వారి మ‌న‌సుల్ని దోచుకునేలా ఫుడ్ ప్రిప‌రేష‌న్ ఉంటుంద‌ని చెబుతారు.

ఒక‌వేళ భోజ‌నానికి ఎవ‌రైనా ప్ర‌ముఖుడ్ని పిలిస్తే..స‌ద‌రు ప్ర‌ముఖుడి వ్య‌క్తిగ‌త ఇష్టాయిష్టాల్ని క‌నుక్కొని మ‌రీ మెనూ రెఢీ చేయిస్తార‌ని చెబుతారు. కేసీఆర్ భోజ‌నానికి పిల‌వ‌టం అంటే.. కేవ‌లం తిన‌టానికి మాత్ర‌మే కాదు. లంచ్ కి కానీ.. డిన్న‌ర్‌ కి కానీ పిలిస్తే త‌క్కువ‌లో త‌క్కువ రెండు గంట‌ల నుంచి నాలుగు గంట‌ల వ‌ర‌కూ గ‌డుపుతార‌ని చెబుతారు.

చాలా త‌క్కువ‌మందికి తెలిసిన విష‌యం ఏమిటంటే.. కేసీఆర్ భోజ‌న ప్రియుడు. అంతేకాదు.. అతిధ్యం ఇచ్చే విష‌యంలో ఆయ‌న వ్య‌వ‌హార‌మే వేరుగా ఉంటుంద‌న్న మాట ఆయ‌న స‌న్నిహితులు చెబుతుంటారు.

మ‌రి.. అలాంటి కేసీఆర్ నేతృత్వంలో ప్ర‌ప‌పంచ తెలుగు మ‌హాస‌భ‌లు జ‌రుగుతుంటే.. ఏర్పాట్లు ఎంత భారీగా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఈ నెల 15 నుంచి జ‌రిగే మ‌హాస‌భ‌ల‌కు సంబంధించి వ‌డ్డించే భోజ‌నాల‌కు సంబంధించిన మెనూను సిద్ధం చేశారు. మెనూ విన్నంత‌నే నోరు ఊరేలా ఉండ‌టం ఒక ప్ర‌త్యేక‌త‌.

ఈ స‌భ‌ల సంద‌ర్భంగా కేవ‌లం వెజ్ మాత్ర‌మే వ‌డ్డించ‌నున్నారు. అలా అని లోటు చేస్తార‌ని అనుకుంటే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఎందుకంటే.. ప్ర‌తి రోజు 14 నుంచి 15 ర‌కాల స్పెష‌ల్స్ ఉండ‌నున్నాయి. ఇవి కాక‌.. డైలీ ఉండే వంట‌కాలు ఉండ‌నే ఉంటాయి. మొత్తంగా చూస్తే.. కంచం నిండా తిన్న వారికి తిన్నంత అన్న‌ట్లుగా భోజ‌నం ఉంటుంద‌ని చెబుతున్నారు.

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల‌కు సంబంధించిన‌కార్య‌క్ర‌మాలు ఎలా ఉంటాయన్న‌ది ప‌క్క‌న పెడితే.. విందు భోజ‌నాన్ని మాత్రం మ‌ర్చిపోలేని రీతిలో ఉంటుంద‌ని చెబుతున్నారు. స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యే అతిధుల జిహ్వాకు పండ‌గే అంటున్నారు.

రోజుకు 14 నుంచి 15 ర‌కాల స్పెష‌ల్స్ తో ఒక‌రోజు వ‌డ్డించిన మెనూను మ‌రో రోజు వ‌డ్డించ‌కుండా తెలుగు.. ఉత్త‌రాది వంట‌కాల్ని వ‌డ్డించ‌నున్నారు. పూర్తి శాఖాహారం వ‌డ్డించే ఈ వంట‌కాల బాధ్య‌త‌ను ప్ర‌త్యేకంగా పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ ను పుడ్ క‌మిటీ ఛైర్మ‌న్ గా ఎంపిక చేశారు. రోజుకు ఎనిమిది నుంచి 10 వేల మంది వ‌ర‌కు భోజ‌నాలు చేస్తార‌ని చెబుతున్నారు.

ప్ర‌తి రోజు త‌ప్ప‌నిస‌రిగా ఉండేవి చూస్తే..

అన్నం

స‌లాడ్‌

స‌కినాలు

చ‌ల్ల మ‌రిప‌కాయ‌

అప్ప‌డం

స‌ర్వ‌పిండి

మూడు ర‌కాల పొడులు

మూడు ర‌కాల ప‌చ్చ‌ళ్లు

నెయ్యి

పెరుడు

ప‌ప్పుచారు

250 మిల్లీ లీట‌ర్ల వాట‌ర్ బాటిల్‌

క‌ట్ మిర్చి

సాదా స్వీట్ పాన్‌

ఫ్రూట్ కౌంట‌ర్‌

పిండివంట‌ల కౌంట‌ర్‌

ఇవి కాక‌.. నాలుగు రోజుల‌కు సంబంధించి ఏ రోజుకు ఆ రోజు వ‌డ్డించే స్పెషల్స్ చూస్తే..

డిసెంబ‌రు 16

వెజ్ బిర్యానీ

రైతా

బ‌గారా బైగాన్‌

ప‌ట్టు వ‌డియాల పులుసు

ప‌న్నీర్ బ‌ట‌ర్ మ‌సాలా

బెండ‌కాయ ఫ్రై

పాల‌కూర ప‌ప్పు

చింత‌పండు మిర్చి చ‌ట్నీ

దొండ‌కాయ ప‌చ్చ‌డి

ప‌చ్చిపులుసు

ట‌మాటా ర‌సం

పులిహోర‌

గ‌జ‌ర్ కా హ‌ల్వా

బ‌క్ష్యాలు

పూరీ

డిసెంబ‌రు 17

జీరా రైస్‌

బీర‌కాయ ట‌మోట సోయ‌కూర‌

మెంతి పులుసు

ఆల‌ముత్త‌ర్

గొంగూరు ప‌ప్పు

దొస‌కాయ చ‌ట్నీ

ప‌చ్చి పులుసు

కంద‌గ‌డ్డ పులుసు

పెస‌ర గారెలు

బూందీ ల‌డ్డు

డిసెంబ‌రు 18

గారా రైస్‌

క్యాప్సికం కూర‌

సొర‌కాయ పొడిప‌ప్పు

మిక్సెడ్ వెజ్ క‌ర్రీ

ఆలు వేపుడు

మామిడికాయ ప‌ప్పు

ట‌మాట చ‌ట్నీ

బీర‌కాయ ప‌చ‌చ‌డి

ప‌చ‌చి పులుసు

మ‌జ్జిగ చారు

మ‌క్కు గారెలు

డిసెంబ‌రు 19

ట‌మాట రైస్‌

చిక్కుడు కాయ.. ట‌మోటా కూర‌

వంకాయ పులుసు

ఆలు పాల‌క్‌

కంద వేపుడు

ట‌మాట ప‌ప్పు

వంకాయ చ‌ట్నీ

గొంగూర చ‌ట్నీ

ప‌చ్చి పులుసు

అర‌టికాయ బ‌జ్జీ

డ‌బుల్ కా మీఠా

లైవ్ బెల్లం జిలేబీ

రుమాలీ రోటీ
Tags:    

Similar News