ప‌దికి పైగా ఛాన‌ళ్ల‌తో కేసీఆర్ న‌యా ప్ర‌చారం

Update: 2017-07-27 04:37 GMT
సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు దాదాపు రెండేళ్ల స‌మ‌యం ఉంది. అయితే.. ఈ ఎన్నిక‌ల కోసం కొన్ని నెల‌ల ముందు నుంచే తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ క‌స‌ర‌త్తు చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే ప‌లు వ‌ర్గాల్ని టార్గెట్ చేసిన‌ట్లుగా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా సంక్షేమ కార్య‌క్ర‌మాల్ని కేసీఆర్ ప్ర‌క‌టించ‌టం ద్వారా.. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌లు వ‌న్ సైడ్ గా జ‌ర‌గాల‌న్న‌దే త‌న ల‌క్ష్య‌మ‌న్న విష‌యాన్ని ఇప్ప‌టికే ప‌లుమార్లు స్ప‌ష్టం చేయ‌టం తెలిసిందే. త‌న తండ్రి క‌ల‌ల్ని త‌న‌దైన శైలిలో తాజాగా చెప్పేశారు సీఎం కుమారుడు క‌మ్ తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్.

తాజాగా ఐటీ శాఖ అధ్య‌ర్వంలో జ‌రిగిన మ‌న టీవీ స్థానంలో టీ శాట్ పేరిట కొత్త నెట్ వ‌ర్క్‌ను ప్రారంభించిన సంద‌ర్భంగా మంత్రి కేటీఆర్ నోటి నుంచి ఆస‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.

తెలంగాణ కోసం ప్ర‌త్యేక ఉప గ్ర‌హ సేవ‌ల్ని వినియోగించుకుంటామ‌ని.. ప‌ది నుంచి ప‌న్నెండు టీవీ ఛాన‌ళ్ల‌ను ఏర్పాటు చేస్తామ‌ని చెప్ప‌టం ద్వారా.. రానున్న రోజుల్లో టీవీ ఛాన‌ళ్ల ఏర్పాటు విష‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ఎంత చురుగ్గా వ్య‌వ‌హ‌రిస్తుంద‌న్న విష‌యాన్న చెప్ప‌క‌నే చెప్పేశార‌ని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ ప‌థ‌కాల్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లేందుకు..వివిధ వ‌ర్గాల‌కు అవ‌స‌ర‌మైన స‌మాచారాన్ని అందించేందుకు వీలుగా తాజాగా ఏర్పాటు చేసే ఛాన‌ళ్ల‌ను వినియోగించుకుంటామ‌న్న సందేశాన్ని త‌న మాట‌ల్లో కేటీఆర్ చెప్పేశార‌ని చెప్పాలి.

ఇప్ప‌టికే వినియోగంలో ఉన్న మ‌న ఛాన‌ల్ ద్వారా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాల్ని ప్ర‌జ‌ల్లోకి తీసుకెళుతున్న విష‌యాన్ని చెప్పిన కేటీఆర్‌.. రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఛాన‌ళ్ల‌ను ఏర్పాటు చేయ‌టం ద్వారా.. ప్ర‌భుత్వ వాద‌న‌ల్ని.. ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకోవాల‌న్న ఆలోచ‌న కేటీఆర్ మాట‌ల్లో క‌నిపిస్తోంద‌ని చెప్పాలి. ఈ మ‌ధ్య‌న ఇస్రో ప్ర‌యోగించిన 104 ఉప‌గ్ర‌హాల్లో ఒకదానిని తమ‌కు కేటాయించాల‌ని ఇస్రో ఛైర్మ‌న్ ను కోరుతామ‌న్న విష‌యాన్ని వెల్ల‌డించారు. అస‌లు అవ‌కాశం ఉందో లేదో తెలుసుకోకుండానే కేటీఆర్‌.. అధికారికంగా ప్ర‌క‌ట‌న చేయ‌టం విశేషంగా చెప్పాలి. తాజాగా కేటీఆర్ నోటి నుంచి వ‌చ్చి ప‌దికి పైగా టీవీ ఛాన‌ళ్ల మాట వింటుంటే.. రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల ప్ర‌చారం ఒక రేంజ్లో సాగుతాయ‌న్న అభిప్రాయం క‌ల‌గ‌టం ఖాయం.
Tags:    

Similar News