హైదరాబాద్ లో అందరికీ సెలవులు!

Update: 2020-07-05 07:04 GMT
తెలంగాణలో కరోనా విజృంభిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కోరలు చాస్తోంది. ప్రతీరోజు 2వేల దాకా కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసుల తీవ్రత పెరుగుతూనే ఉంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు.

దీంతో తెలంగాణ ప్రభుత్వం సీరియస్ గా ముందుకెళుతోంది.  ఈ మేరకు అదుపు చేసేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పకడ్బందీగా ముందుకెళ్లడానికి సిద్ధమైంది.

గ్రేటర్ పరిధిలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్సలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రైవేట్ ల్యాబుల్లో కరోనా టెస్టులపై అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ పరంగా టెస్టింగ్ కేంద్రాలను పెంచడం లాంటి అంశాలపై సర్కార్ దృష్టిసారించింది.

హైదరాబాద్ లో వైద్యచికిత్సల కోసం చేయాల్సిన ఏర్పాట్లను యుద్ధ ప్రాతిపదికన చేయాలని సర్కార్ నిర్ణయించింది. అదనంగా ఆస్పత్రుల ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది.

ఈ నేపథ్యంలోనే ప్రభుత్వ - ప్రైవేట్ కార్యాలయాలకు రెండు లేదా మూడు వారాల పాటు సెలవులు ప్రకటించాలన్న ఆలోచనను తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నట్టు తెలుస్తోంది. వ్యాపారాలు ఇప్పటికే మూసి ఉన్నాయి. ఇప్పుడు కార్యాలయాలు పనిచేయకపోతే జనం రోడ్లపైకి వచ్చే అవకాశం ఉండదు. ఇక ర్యాపిడ్ టెస్టులు హైదరాబాద్ లో చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. గ్రేటర్ హైదరాబాద్ లో కరోనా కట్టడికి ప్రభుత్వం యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తోంది.
Tags:    

Similar News