మన రాష్ట్రాన్ని మనమే పరిపాలించుకుందామని చెప్పి తెలంగాణలో గద్దెనెక్కిన టీఆరెస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే ఎన్నో తప్పటడుగులతో విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఆయన తానెప్పుడూ విమర్శించే ఆంధ్రపాలకులకు తాను ఎందులోనూ తక్కువ కాదని... వారికంటే నాలుగాకులు ఎక్కువే చదివానని నిరూపించుకున్నారు. అణిచివేతలో తానూ అందరిలాంటివాడినేనని రుజువు చేశారు. వేతనాల పెంపు కోసం ఛలో అసెంబ్లీ పేరిట ఉద్యమించిన ఆశా వర్కర్ల పైన ఉక్కుపాదం మోపారు.
హైదరాబాద్ సహా పలుచోట్ల ఆందోళనకు దిగిన ఆశా వర్కర్లను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. ఎక్కడికి అక్కడే అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌లకు తరలించారు. ఈ క్రమంలో తోపులాటలు జరిగాయి. పలువురు ఆశా వర్కర్లకు స్వల్ప గాయాలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు తొమ్మిదివేల మందిని అరెస్టు చేశారు. సచివాలయం ముట్టడికి, జిల్లాల్లో ఆందోళనలకు ప్రయత్నించిన 8805 మంది ఆశా వర్కర్లను అరెస్టు చేసినట్లు డిజిపి అనురాగ్ శర్మ స్వయంగా ప్రకటించడమే దీనికి నిదర్శనం.
మరోవైపు దేశానికే వెన్నెముక అయిన అన్నదాతలను కేసీఆర్ గాలికొదిలేశారని... అప్పులపాలైన రైతులు పిట్టల్లా రాలిపోతుంటే ఆయన కనీసం పరామర్శించలేదని విపక్షాలు గొంతెత్తిన సంగతి తెలిసిందే. ఇదే అంశంమీద తెలగుదేశం, కాంగ్రెస్ కూడా ఏకమైన ఇప్పుడు ఆందోళనలు చేస్తున్నాయి. ఇంత జరుగుతున్నా కేసీఆర్ మాత్రం నీరో చక్రవర్తిలా నిమ్మకు నీరెత్తినట్లు ఉంటున్నారు. తాజాగా ఆశా కార్యకర్తల ఆందోళనలకూ విపక్షాలు మద్దతు పలకాలని నిర్నయించినట్లు సమాచారం. రైతుల సమస్యపై ఆందోళనల తరువాత ఆశా కార్యకర్తలతో చర్చించి కార్యాచరణ రూపొందించే అవకాశాలున్నాయి.