సబ్సిడీ మీద లక్ష టన్నులు ఇవ్వమంటున్నారు

Update: 2015-08-13 04:39 GMT
ఎవరు ఏం అడిగినా ఇచ్చినా.. ఇవ్వకున్నా.. తెలంగాణ సర్కారు మాత్రం తెలంగాణ పౌల్ర్టీ ప్రతినిధుల కోర్కెల విషయంలో మాత్రం సానుకూలంగా ఉంటుందన్న అభిప్రాయం ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో పోలిస్తే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు కోరిన కోర్కెలను తెలంగాణ సర్కారు పెద్ద మనసుతో ఒప్పుకోవటం తెలిసిందే.

ఇప్పటికే రాయితీతో విద్యుత్తు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వాన్ని.. కరవు పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకొని భారీ కోరికను తాజాగా పౌల్ర్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. వర్షాభావ నేపథ్యంలో  కోళ్ల దాణా పెరిగిపోతున్న నేపథ్యంలో సబ్సిడీ మీద దాణా ఇవ్వాలని వారు పేర్కొన్నారు.

మార్కెట్ రేటు కాకుండా సబ్సిడీ మీద కోళ్ల దాణా ఇవ్వాలన్న తమ ప్రతిపాదనకు మంత్రుల నుంచి సానుకూల స్పందన వచ్చినట్లుగా వారు చెబుతున్నారు. కిలో మొక్కజొన్నను రూ.13.50 చొప్పున ఇచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లుగా చెబుతున్నారు.

ఇలా సబ్సిడీ మీద ఇవ్వనున్న దాణా ఏ వెయ్యి కిలోలో.. పదివేల కిలోలో కాదు.. ఏకంగా లక్ష టన్నులు (టన్ను అంటే వెయ్యి కిలోలు) ఇచ్చేందుకు ఓకే చెప్పినట్లుగా చెబుతున్నారు. ఏమైనా పౌల్ర్టీ పరిశ్రమ నుంచి ఏ ప్రతిపాదన వచ్చినా తెలంగాణ మంత్రులు సానుకూలంగా స్పందిస్తారన్న మాటను మరోసారి నిలబెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ కు భారీగా పౌల్ట్రీ పరిశ్రమ ఉండటం ఇక్కడ గమనార్హం.
Tags:    

Similar News