సర్కారు ఖాతాలోకి సీబీఐటీ..?

Update: 2015-07-11 09:27 GMT
పేరు ప్రఖ్యాతులున్న ఇంజినీరింగ్‌ కళాశాలల పేర్లు చెప్పాల్సి వస్తే.. తెలుగు ప్రాంతాల వారు చెప్పే కొన్ని పేర్లలో సీబీఐటీ ఒకటి. చైతన్యభారతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ కళాశాల పేరును సింఫుల్‌గా సీబీఐటీగా పేర్కొంటారు. సొసైటీల చట్టం కింద ఏర్పడిన ఈ కళాశాలను తెలంగాణ సర్కారు స్వాధీనం చేసుకుంటుందా? ఆ దిశగా అడుగులు పడుతున్నాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కొందరు ప్రముఖల నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కళాశాలలో ఈ మధ్య చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకలు బయటకు పొక్కటం.. దీనికి తోడు ఈ వ్యవహారంలో రాజకీయంగా చోటు చేసుకోవటంతో.. తెలంగాణ సర్కారు ఈ అంశంపై దృష్టి సారిస్తుందని చెబుతున్నారు. ఈ కాలేజీ వ్యవస్థాపకుల్లో మాజీ చీఫ్‌ జస్టిస్‌ కొండా మాధవరెడ్డి కుమారుడు.. టీఆర్‌ఎస్‌ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి కూడా పాత్ర ఉన్నప్పటికీ.. ఆయనకు ఏ మాత్రం అవకాశం లేకుండా చేయటం.. మిగిలిన వర్గాల వారు అధిపత్యం చలాయించటంతో.. తెలంగాణ అధికారపక్షం ఈ వ్యవహారంలో జోక్యం చేసుకునే అవకాశాలు మొండుగా ఉన్నాయని చెబుతున్నారు.

దీనికి తోడు.. టీడీపీ ఎంపీ (రాజ్యసభ).. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన సుజనాచౌదరి డైరెక్షన్‌లో ఇప్పటి యాజమాన్యం నడుస్తుందని.. ఈ కళాశాలకు చెందిన రూ.400కోట్ల మేర ఆర్థిక అవకతవకలు చోటు చేసుకున్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో.. ఈ వ్యవహారంలో తెలంగాణ రాష్ట్ర సర్కారు వేలు పెట్టటం ఖాయమన్న వాదన వినిపిస్తోంది. తప్పులు ఎత్తి చూపి ప్రభుత్వం ఈ సంస్థను స్వాధీనం చేసుకునే అవకాశమే ఎక్కువగా ఉందని చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే.. మిగిలిన బోర్డు సభ్యులు ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు ప్రశ్నగా మారుతోంది.

Tags:    

Similar News