తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయితే పరిపాలనను మరింత వికేంద్రీకరణ చేసేందుకు వీలుగా తెలంగాణ రాష్ట్రంలోని 10 జిల్లాలను 23 జిల్లాలుగా పెంచేలా చేస్తామంటూ తెలంగాణ ఉద్యమ సమయంలో టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పలుమార్లు చెప్పటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి.. అధికార పగ్గాలు చేపట్టాక.. తాను గతంలో వినిపించిన వాదనకు తగ్గట్లే కొత్త జిల్లాల ఏర్పాటు మీద టీఆర్ ఎస్ సర్కారు దృష్టి సారించింది.
అయితే.. తొలుత అనుకున్న విధంగా 13 కొత్త జిల్లాల్ని ఒకేసారి ఏర్పాటు చేయకుండా దశల వారీగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయాలని కేసీఆర్ సర్కారు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త జిల్లాల ఏర్పాట్ల సందర్భంగా తలెత్తే పరిస్థితులు.. పరిణామాలతో పాటు.. అధికార వికేంద్రీకరణకు అవసరమైన సిబ్బంది లాంటి అంశాల విషయంలో తలనొప్పులు ఎదురవుతాయని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు చెబుతున్నారు. అందుకే.. కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాల విషయంలో తొందరపాటు పడకుండా.. జాగ్రత్తగా ముందుకెళ్లాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
మొత్తం 13 కొత్త జిల్లాలకు గాను.. తొలి దశలో 5 జిల్లాల్ని కొత్తగా ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. 2016 మొదట్లో కొత్త జిల్లాల ఏర్పాటుకు కసరత్తు జరుపుతున్నారు. తొలిదశలో అదిలాబాద్.. మెదక్.. రంగారెడ్డి.. నల్లొండ.. మహబూబ్ నగర్ జిల్లాల్లో ఐదు కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేసి.. అక్కడి అనుభవాల ఆధారంగా మిగిలిన 8కొత్త జిల్లాల్ని ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది.
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో తెలంగాణ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి జిల్లాలు ఏర్పాటు చేయాలన్న వాదనలు తెరపైకి వస్తున్నాయి. ఈ వ్యవహారం తేనెతుట్టగా మారిందని అధికారపార్టీకి చెందిన ముఖ్యులు అందోళన చేయటం గమనార్హం. కొత్త జిల్లాలకు సంబంధించిన ప్రక్రియలో ఏ మాత్రం తప్పులు జరిగినా.. భావోద్వేగాలకు దారి తీసి లేనిపోని గొడవలకు దారి తీస్తుందేమోనన్న భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనికి తగ్గట్లే పలు కొత్త జిల్లాలకు సంబంధించిన డిమాండ్లు తెరపైకి రావటం గమనార్హం.
తాజాగా చెబుతున్న వాదన ప్రకారం తొలిదశలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న ఐదు జిల్లాలు చూస్తే..
= అదిలాబాద్ జిల్లా నుంచి మంచిర్యాల జిల్లా
(కరీంనగర్ జిల్లా రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంతో పాటు.. అదిలాబాద్ జిల్లాలోని అసిఫాబాద్.. బెల్లంపల్లి.. సిర్పూర్ కాగజ్ నగర్.. చెన్నూరు నియోజకవర్గాలతో కొత్త జిల్లా)
= మెదక్ జిల్లా నుంచి సిద్ధిపేట జిల్లా
(కరీంనగర్ జిల్లాకు చెందిన హుస్నాబాద్.. వరంగల్ జిల్లాలోని జనగామ.. నల్గొండ జిల్లాలోని అలేరు కలపాలన్న వినతలు వినిపిస్తున్నాయి. అయితే.. తుది దశలో మాత్రం జనగామ.. హుస్నాబాద్.. సిద్ధిపేట.. గజ్వేల్.. దుబ్బాక నియోజకవర్గాలు ఉండనున్నాయి)
= రంగారెడ్డి జిల్లా నుంచి వికారాబాద్ జిల్లా
(వికారాబాద్.. చేవేళ్ల.. తాండూరు.. పరిగి నియోజకవర్గాల్లో కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు)
= నల్గొండ జిల్లా నుంచి సూర్యాపేట జిల్లా
(సూర్యపేట.. మిర్యాలగూడ.. హుజూర్ నగర్.. కోదాడ.. తుంగతుర్తి నియోజకవర్గాలతో కొత్త జిల్లా ఏర్పాటు చేయనున్నారు. అయితే.. దీన్లో భువనగిరి.. ఆలేరు.. ఎల్ బీనగర్ ను కూడా కలపాలన్న ప్రతిపాదన ఉంది)
= మహబూబ్ నగర్ జిల్లా నుంచి నాగర్ కర్నూల్ జిల్లా
(నాగర్ కర్నూల్ తో పాటు.. కొల్లాపూర్.. కల్వకర్తి.. అచ్చంపేట నియోజకవర్గాలు ఉండనున్నాయి)