దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన మత ప్రార్థనల వ్యవహారం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొత్త కలకలంగా మారింది. తాజాగా మరణించిన కరోనా మరణాలన్ని ఢిల్లీ మత ప్రార్థనలకు హాజరైన వారే కావటంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. ఎప్పుడైతే.. మత ప్రార్థనలకు హాజరైన వారు మరణించటం.. కొత్త పాజిటివ్ కేసులు ఆ లింకుతోనే ఉండటంతో.. అసలు తెలంగాణలో ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారు ఎవరు? ఎంతమంది? అనే లెక్కలు సేకరించటం షురూ చేశారు. అలా వెళ్లి వచ్చిన వారు ఎంతమందిని కాంటాక్టు అయ్యారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
ప్రాధమికంగా.. మత ప్రార్థనల్లో పాల్గొన్న వారికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులు వేసిన జల్లెడ కొత్త క్లారిటీని ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాల వారీగా ఈ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిని గుర్తించారు. ఇప్పుడు వారందరికి పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం.. వారు ఎవరెవరిని కలిశారు? వారిలో ఎంతమందికి కరోనా లక్షణాలు ఉన్నాయి? అన్నది తేల్చనున్నారు. ఇప్పటివరకూ అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ ప్రార్థనలకు హాజరైన వారిలో అత్యధికులు హైదరాబాదీయులు కాగా.. తర్వాతి స్థానం మెదక్ జిల్లా వారు. ఈ జిల్లా నుంచి 26 మంది వెళ్లగా.. వరంగల్.. మహబూబ్ నగర్ జిల్లాల నుంచి పాతిక మంది చొప్పున హాజరైనట్లుగా తేల్చారు.
ఇప్పటివరకూ జల్లెడ వేసిన దాని ప్రకారం జిల్లాల వారీగా ఎంతమంది లెక్క తేలారంటే..?
హైదరాబాద్ 186
నిజామాబాద్ 18
మెదక్ 26
నల్గొండ 21
ఖమ్మం 15
అదిలాబాద్ 10
రంగారెడ్డి 15
వరంగల్ 25
కరీంనగర్ 17
మహబూబ్ నగర్ 25
బైంసా 11
నిర్మల్ 11