తెలంగాణ సచివాలయంలో ఆంధ్రోళ్లకు కొలువులా? వినేందుకు విచిత్రంగా ఉన్నా ఇది నిజం. తెలంగాణ రాష్ట్రంలో అదెలా కుదురుతుందన్న సందేహం అక్కర్లేదు. కోర్టు డైరెక్షన్ తో ఇది సాధ్యమైంది. ఆంధ్రా స్థానికత ఉన్న 24 మందికి ఉద్యోగాలు ఇస్తూ తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది.
తెలంగాణ సచివాలయంలో వివిధ శాఖల్లో సెక్షన్ అధికారులుగా విధులు నిర్వహించిన 24 మందిని ఆంధ్రా స్థానికతను ఎత్తి చూపుతూ ఆంధ్రాకు పంపించారు. ఇందులో భాగంగా రిలీవ్‌చేశారు. అయితే.. ఏపీ సర్కారు మాత్రం వారిని విధుల్లోకి తీసుకోలేదు. స్థానికతలోని అంశాల్ని ఏపీ ప్రభుత్వం ఎత్తి చూపి వారిని తిరస్కరించింది.
ఓవైపు ఆంధ్రా స్థానికత చూపి తెలంగాణ రాష్ట్ర సర్కారు రిలీవ్ చేస్తే.. మరోవైపు ఏపీ సర్కారు నో అనటంతో 24 మంది ఉద్యోగులు హైకోర్టును ఆశ్రయించారు.
ఈ నేపథ్యంలో ఈ ఉదంతంపై విచారణ చేపట్టిన హైకోర్టు.. రిలీవ్ చేసిన ఉద్యోగుల్ని తెలంగాణ సచివాలయంలో విధుల్లోకి చేర్చుకోవాలంటూ పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. కోర్టు ఆదేశాల నేపథ్యంలో తెలంగాణ అధికారులు 24 మంది ఆంధ్రా స్థానికత ఉన్నట్లుగా వాదిస్తున్న తెలంగాణ సర్కారు కొలువులు ఇవ్వాల్సి వచ్చింది.