ఉత్కంఠ భరితంగా సాగిన ఎన్నికల్లో తమ పార్టీ అనుబంద కార్మిక సంఘాన్ని గెలిపించిన సింగరేణి కార్మికుల కోసం వీలైనన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్...తన హామీలకు ఆచరణ రూపం అందిస్తున్నారు. ఈ కోవలోనే తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ప్రగతిభవన్‌లో ఆయన సింగరేణి కార్మికుల ఆత్మీయ సమ్మేళనంలో ప్రసంగిస్తూ...సింగరేణి అవినీతిపై ఆయన గళం విప్పారు. ఏళ్ల నుంచి వేళ్లూనుకుపోయిన అవినీతి భరతం పడుతామని ప్రతినబూనారు. లంచం అడిగినోళ్లను, తీసుకొనేటోళ్లను చెప్పుతో కొట్టాలని ముఖ్యమంత్రి అన్నారు. మెడికల్ అన్ ఫిట్ నుంచి క్వార్టర్ల కేటాయింపు వరకు ప్రతిపనిలో గత పాలకులు లంచాలు తీసుకోవడం ప్రారంభించారని - ఇకనుంచి ఆ సంస్కృతికి చరమగీతం పాడుదామని కార్మికులకు పిలుపునిచ్చారు. లంచం అంతం చేయాలని పలుమార్లు కోరిన సీఎం కేసీఆర్ ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ప్రారంభిస్తామని కూడా ప్రకటించారు. అక్రమాలకు - లంచాలకు నిలయంగా మారిన సింగరేణి మెడికల్ బోర్డును ప్రక్షాళన చేస్తామని చెప్పారు.
అయితే సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేసిన మరుసటి రోజే సదరు అధికారిపై బదిలీ వేటు పడింది. భద్రాద్రికొత్తగూడెంలో ఉన్న సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ బదిలీ అయిపోయారు. ప్రస్తుతం పదవిలో ఉన్న కే.ప్రతాప్ సింహాను ఆ పదవి నుంచి తొలగిస్తూ సింగరేణి యాజమాన్యం ఉత్తర్వులు జారీ చేసింది. చీఫ్ మెడికల్ ఆఫీసర్ గా మంథా శ్రీనివాస్ ను నియమిస్తూ సింగరేణి సంస్థ ఛైర్మన్, ఎండీ శ్రీధర్ ఆదేశాలు ఇచ్చారు. దీంతో కేసీఆర్ కన్నెర్ర చేస్తే...తెల్లారే పదవి ఊడుతుందని సింగరేణిలో చర్చ జరుగుతోంది. మరోవైపు కార్మికులకు ఇంకో తీపికబురును సీఎం కేసీఆర్ అందించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు సింగరేణిలో 2,718 మంది బదిలీ వర్కర్లకు జనరల్ మజ్దూర్లుగా రెగ్యులరైజేషన్ చేయడానికి దస్త్రంపై సింగరేణి సీఎండీ సంతకం చేశారు. 2016, డిసెంబర్ 31 నాటికి తగిన హాజరు శాతం గల ఈ కార్మికులకు జనరల్ మజ్దూర్లుగా అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నామనీ, ఒకట్రెండు రోజుల్లో వీటిని కార్మికులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. మొత్తం 2,718 మందిలో బదిలీ వర్కర్లు 2,416 మంది, బదిలీ కోల్‌ఫిల్లర్లు 299 మంది, టెంపరరీ టన్నెలింగ్ మజ్దూర్లు ముగ్గురు ఉన్నారు. కాగా 21 మంది సెక్యూరిటీ గార్డులకు జమేదార్లుగా ప్రమోషన్లు కల్పించారు.
ఇన్నాళ్ల్లు సింగరేణిని పట్టించుకోలేదని, ఇకనుంచి తామేమిటో చూపిస్తామని, కార్మికుల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తామని కార్మికులతో జరిగిన సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్నికలు వచ్చిన ప్రతిసారీ సంఘాలు, పార్టీలు మాత్రమే గెలుస్తున్నాయని చెప్పిన సీఎం కేసీఆర్.. ఈసారి గెలుపు కార్మికులదని, వారికి ప్రతిఫలం దక్కాలన్నారు. కార్మికుల సమస్యలు తెలుసుకొనేందుకు స్వయంగా సింగరేణి యాత్ర చేపడుతానని, ప్రతి క్వార్టర్ తిరిగి కార్మికులను కలిసి సమస్యలు విని, ఒక్కొక్కటి పరిష్కరించుకొంటూ ముందుకు పోతానని హామీ ఇచ్చారు. గతంలో సింగరేణి ఎన్నికల్లో గెలిచిపించినప్పటికీ ఏమీచేయలేకపోయామని.. ఇకనుంచి అలాంటి పరిస్థితి తలెత్తకుండా చూసుకొనే బాధ్యత తనదని ప్రకటించారు. కాగా...ఆ ప్రకటన వాస్తవ రూపం దాల్చేలా తాజా నిర్ణయం ఉందంటున్నారు.