ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలు తమ తమ దారుల్లో ప్రయాణిస్తున్నాయి. హైదరాబాద్ లాంటి అధిక ఆదాయాన్ని ఇచ్చే నగరాన్ని ఆంధ్రప్రదేశ్ పోగొట్టుకుంది. అయినప్పటికీ తెలంగాణతో పోలిస్తే విస్తారమైన వనరులు పరంగా ఆంధ్రప్రదేశ్ ముందుంది. దీంతో ఇటీవల వరకు ఆదాయం కూడా తెలంగాణ కంటే ఆంధ్రాకే ఎక్కువ ఉంది. అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత తొలిసారిగా తెలంగాణ ఏపీని అధిగమించింది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లెక్కలు ఈ విషయాన్ని చెబుతున్నాయి.
ఏపీ ఆర్థిక వ్యవస్థ కు జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ల ద్వారా వచ్చే ఆదాయం.. ప్రధాన వనరులుగా ఉన్నాయి, తెలంగాణతో పోలిస్తే ఏపీలో గత ఆర్థిక సంవత్సరంలో అవి బాగా తగ్గాయి. దిగువ పట్టిక ను చూస్తే ఈ విషయం తేటతెల్లమవుతోంది. 2022–23 ఆర్థిక సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ఆదాయం రూ.1,067 కోట్లు పెరిగింది.
సంవత్సరం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ
2014–15 రూ.65,695 కోట్లు రూ.51,042 కోట్లు
2015–16 రూ.88,648 కోట్లు రూ.76,134 కోట్లు
2016–17 రూ.98,994 కోట్లు రూ.82,818 కోట్లు
2017–18 రూ.1,05,060 కోట్లు రూ.88,824 కోట్లు
2018–19 రూ.1,14,684 కోట్లు రూ.1,01,420 కోట్లు
2019–20 రూ.1,11,034 కోట్లు రూ.1,02,544 కోట్లు
2020–21 రూ.1,17,136 కోట్లు రూ.99,903 కోట్లు
2021–22 రూ.1,50,552 కోట్లు రూ.1,27,468 కోట్లు
2022–23 రూ.1,58,282 కోట్లు రూ.1,59,349 కోట్లు
2022–23లో కేంద్ర ప్రభుత్వం నుంచి ఏపీ కి రూ.36,048 కోట్లు గ్రాంట్లు అందగా, తెలంగాణ కు రూ.13,179 కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే తెలంగాణ కంటే ఏపీకి రూ. 22,869 కోట్లు ఎక్కువ వచ్చాయి. అయినా సరే ఆదాయంతో తెలంగాణ .. ఆంధ్రా ను అధిగమించడం విశేషం.
జీఎస్టీ, సేల్స్ ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ వంటి రాబడి తగ్గడానికి అనేక కారణాలున్నాయి. 2021–22లో జీఎస్టీ రూపంలో తెలంగాణకు రూ.34,489 కోట్లు రాగా, ఏపీకి రూ.34,262 కోట్లు వచ్చాయి. అలాగే 2022–23లో తెలంగాణ జీఎస్టీ ఆదాయం రూ.41,888 కోట్ల కు పెరిగింది. కాగా ఆంధ్రప్రదేశ్ జీఎస్టీ ఆదాయం రూ.38,840 కోట్లు గా మాత్రమే ఉంది.
సేల్స్ ట్యాక్స్ లోనూ ఏపీ వెనుకబడి ఉంది. గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్, మద్యంపై విక్రయ పన్ను ద్వారా తెలంగాణకు రూ.29,604 కోట్లు రాగా, ఏపీకి రూ.18,004 కోట్లు మాత్రమే వచ్చాయి. 2021–22లో ఏపీ సాధించిన సేల్స్ ట్యాక్స్ కంటే ఇది రూ.2900 కోట్లు తక్కువ. మద్యం అమ్మకాలలో తెలంగాణ రూ.18,470 కోట్ల ఆదాయాన్ని ఆర్జించగా, 2022–23 సంవత్సరానికి ఏపీ రూ.14,798 కోట్లు మాత్రమే ఆర్జించింది.
తెలంగాణ తో పోలిస్తే స్టాంపుల రిజిస్ట్రేషన్ల ఆదాయంలో ఏపీ పరిస్థితి మరింత దిగజారింది. 2022–23లో రిజిస్ట్రేషన్ల ద్వారా ఏపీకి రూ.8,022 కోట్లు మాత్రమే రాగా తెలంగాణలో రూ.14,228 కోట్లు ఆదాయం వచ్చింది. 2021–22తో పోలిస్తే.. తెలంగాణ రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.2 వేల కోట్లు పెరగగా, ఏపీ ఆదాయం రూ.400 కోట్లు మాత్రమే పెరిగింది.
ప్రభుత్వ భూముల విక్రయం ద్వారా తెలంగాణ కు 2022–23లో రూ.19,553 కోట్ల పన్నుయేతర ఆదాయం వచ్చింది. భూములు అమ్ముకుని ఆదాయం పెంచుకోవాలని వైసీపీ ప్రభుత్వం భావించి 2021లో మిషన్ ఏపీ బిల్డ్ ను ప్రారంభించినా.. హై కోర్టు రూపంలో అడ్డంకులు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఆలోచనను విరమించుకుంది. దీంతో ఏపీ ప్రభుత్వం బ్యాంకుల్లో భూములను తాకట్టు పెట్టి భారీ వడ్డీకి వేల కోట్ల అప్పులు చేసింది. 2022–23లో ఏపీ కి రూ.6031 కోట్ల పన్నేతర ఆదాయం వచ్చింది.
చెత్త నుంచి పన్ను వసూలు, ఆస్తిపన్ను, ఇంటిపన్ను, పెట్రోల్, డీజిల్ పై సెస్, రోడ్ డెవలప్‌మెంట్ సెస్‌లో తెలంగాణతో పోలిస్తే ఏపీకి ప్రోత్సాహకర ఆదాయం లభించింది. 2022–23 సంవత్సరానికి ఏపీకి రూ.9,109 కోట్లు రాగా, తెలంగాణకు రూ.8,430 కోట్లు మాత్రమే వచ్చాయి.