గోడ దూకి పారిపోయిన ర‌విప్ర‌కాశ్‌.. ఎందుకంటే?

Update: 2019-05-23 03:48 GMT
కేసులు చుట్టుముట్టిన వేళ‌.. స‌మాజ ఉద్ద‌ర‌ణకై కంక‌ణం క‌ట్టుకున్న‌ట్లుగా తెగ బిల్డ‌ప్ లు ఇచ్చే టీవీ9 మాజీ సీఈవో ర‌విప్ర‌కాశ్ ఏం చేశారు? త‌న‌పై అక్ర‌మంగా కేసులు పెట్టిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు చేస్తున్న ఆయ‌న న్యాయ‌పోరాటం చేయ‌టానికి బ‌దులు.. క‌నిపించ‌కుండా పోయిన సంగ‌తి తెలిసిందే. పోలీసుల విచార‌ణ‌కు హాజ‌రుకాని ఆయ‌న్ను అదుపులోకి తీసుకునేందుకు ప్ర‌త్యేక పోలీసు బ‌ల‌గాలు గాలిస్తున్నాయి.

వ‌రుస నోటీసుల‌కు స్పందించ‌కపోవ‌ట‌మే కాదు ప‌త్తా లేకుండా పోయిన ర‌విప్ర‌కాశ్ పై సైబ‌రాబాద్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేయ‌టం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో అరెస్ట్ భ‌యం వెంటాడుతున్న ర‌విప్ర‌కాశ్‌.. హైకోర్టుకు ముంద‌స్తు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. అయితే.. ఆయ‌న ద‌ర‌ఖాస్తును ప‌రిశీలించిన న్యాయ‌స్థానం ఆయ‌న‌కు ముంద‌స్తు బెయిల్ ఇచ్చేందుకు నో చెప్పింది.

ఇదిలాఉంటే.. కోర్టుకు బెయిల్ కోసం ద‌ర‌ఖాస్తు చేసుకున్న ర‌విప్ర‌కాశ్ ఆస‌క్తిక‌ర అంశాల్ని వెల్ల‌డించారు. త‌ప్పుడు కేసులు పెట్టేందుకు పోలీసులు ప్ర‌య‌త్నిస్తున్నార‌ని... త‌న‌ను అరెస్ట్ చేసేందుకు ట్రై చేస్తున్న‌ట్లుగా పేర్కొన్నారు. పోలీసుల నుంచి త‌ప్పించుకోవ‌టానికి తాను గోడ దూకి పారిపోవాల్సి వ‌చ్చింద‌ని ర‌విప్ర‌కాశ్ హైకోర్టుకు తెల‌ప‌టం గ‌మ‌నార్హం.

త‌న‌ను టీవీ 9 నుంచి వెళ్ల‌గొట్టే కుట్ర‌లో భాగంగా మైహోం రామేశ్వ‌ర్ రావు ఆదేశాల మేర‌కు పోలీసులు త‌ప్పుడు కేసులు బ‌నాయించిన‌ట్లుగా పేర్కొన్న ర‌విప్ర‌కాశ్‌.. తాను పోరాడ‌తాన‌ని.. త‌నకు అండ‌గా ఉండాలంటూ వీడియో సందేశం పంప‌టం తెలిసిందే. మీడియాలో ప్ర‌ముఖుడిగా వెలిగిపోయిన ర‌విప్ర‌కాశ్‌.. త‌న వార్త‌ల‌తో.. త‌న క‌థ‌నాల‌తో ఎంద‌రినో ఉరుకులెత్తించిన మాష్టారు.. ఈ రోజు అరెస్ట్ భ‌యంతో గోడ దూకి పారిపోవాల్సిన ప‌రిస్థితుల్లోకి వెళ్లిపోవ‌టం దేనికి నిద‌ర్శ‌నం అంటారు?


Tags:    

Similar News