కరోనాలోని కొత్త రకం వేరియెంట్.. ఒమిక్రాన్.. అత్యంత వేగంగా విస్తరిస్తోంది. కేవలం వారం వ్యవధిలోనే.. 400 కేసులు నమోదయ్యాయంటే దీని విస్తృతి ఏ విధంగా ఉందో అర్ధం అవుతుంది. ఇదే ఇప్పుడు దేశవ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. దీనిపై ప్రభుత్వాలు ఇప్పటికే దృష్టిపెట్టినా.. వేగంలో మాత్రం అదుపు కని పించడం లేదు.
అయితే.. ప్రజలు దీనిని లైట్ గా తీసుకుంటున్నారనే భావన వైద్య నిపుణుల్లో వ్యక్తమవు తోంది. ఎవరూ మాస్కులు ధరించడం లేదు. భౌతిక దూరం కూడా పాటించడం లేదు. దీంతో ఒమిక్రాన్ మరింత వేగంగా వ్యాపించే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
ఇక, తెలంగాణలోనూ.. ఈ కేసులు పెరుగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా కేసుల సంఖ్య పదికి చేరు తుందనే అంచనాలు వస్తున్నాయి. పైగా.. వరుసగా వస్తున్న క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి పండగల సందర్భంగా మరింతగా ఇది విస్తరించే ప్రమాదం ఉందని అందరూ భావిస్తున్నారు. ఈ క్రమంలో తెలంగాణ హైకోర్టు కొన్ని సూచనలు చేసింది. అసలు ఏం చేస్తున్నారని ప్రశ్నించిన కోర్టు.. ఈ సందర్భంగా ప్రజలు ఎక్కువగా గుమిగూడే అవకాశం లేకుండా చేయాలని సూచించింది.
ఈ క్రమంలో ఆ మూడు రోజులు ఆంక్షలు విధించాలని చెప్పింది. ఒమైక్రాన్ వేరియంట్ విజృంభిస్తు న్ననందున రాష్ట్ర ప్రభుత్వం మరింత అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. కొవిడ్ 19 నేపథ్యంలో బాధితులకు చికిత్స, టీకాలు, మౌలిక సదుపాయాలు, ప్రైవేటు హాస్పిటల్స్‌పై నియంత్రణ తదితర అంశాలపై దాఖలైన పలు ప్రజాప్రయోజన వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, జస్టిస్ ఎన్.తుకారాంజీల ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది. విదేశాల్లో కొత్త వేరియంట్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ధర్మాసనం ప్రభుత్వానికి ఆదేశించింది.
విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్టులు జరపాలని, ఇతర జాగ్రత్తలు పాటించాలని చెప్పింది. పండుగలకు పెద్ద ఎత్తున జనం గ్రామాలకు వెళ్లే అవకాశం ఉన్నందున ప్రభుత్వ యంత్రాంగాన్ని అప్రమత్తం చేయాలని ఆదేశించింది. గ్రామాలకు వెళ్లేవారు జగ్రత్తలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన మార్గదర్శకాలను వందశాతం అమలు చేయాలని చెప్పింది. మహారాష్ట్ర, ఢిల్లీ వంటి రాష్ట్రాలు ఇప్పటికే ఇలాంటి ఆంక్షలు విధించాయని ధర్మాసనం గుర్తు చేసింది. మరి తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి.