తెలంగాణ రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైనింగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై అనేక అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సిఎం కెసిఆర్ గురువారం అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కృష్ణా - గోదావరి నదులపై తెలంగాణ ప్రాజెక్టులు ఎందుకు నిర్మాణం కాలేదో ఆయన సవివరంగా వివరించారు. దీంతోపాటు గత రెండు దశాబ్దా లుగా ముఖ్యమంత్రులుగా పనిచేసిన ఆంధ్రప్రదేశ్ ప్రాంత నేతలు తెలంగాణకు తీరని అన్యాయం చేశారని ఆయన ఆరోపణలు గుప్పించారు. గోదావరి - కృష్ణానది నీళ్లలో తెలంగాణకు నీటి కేటాయింపులు ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడంలో అనేక అవాంతరాలను సృష్టించారని ఆరోపించారు. మరి అప్పటి ఇరిగేషన్ మంత్రులు ఈ విషయాలపై ఆనాటి సిఎంలను ఎందుకు ప్రశ్నించలేదు? ఇంతకీ అప్పటి ఇరిగేషన్ మంత్రులు ఎవరు? అన్న ప్రశ్న వేసుకుంటే సమాధానం తెలంగాణ నేతలనే వస్తోంది. అంతేకాదు... ప్రస్తుతం కేసీఆర్ కేబినెట్ లో కీలకంగా ఉన్న నేతలు కూడా అప్పట్లో సమైక్యాంధ్రలో నీటిపారుదల మంత్రులుగా పనిచేశారు. కేసీఆర్ ఆరోపణలు చేసిన ప్రాజెక్టులకు రూపకల్పన చేశారు. దీంతో వేలాది కోట్లు వృథాగా ఖర్చుపెట్టి గంగపాలు చేయడంలో తెలంగాణ ప్రాజెక్టు లలో నీరు రాకుండా చేయడంలో తెలంగాణ నేతల పాత్ర ఎంత అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
2001లో తెలంగాణ ఉద్యమం మొదలయిన నేపథ్యంలోనే అప్పటి చంద్రబాబు సర్కారు దేవాదులకు శంకుస్థాపన చేసిందని కెసిఆర్ అసెంబ్లీలో చెప్పారు. ఈ ప్రాజెక్టును 18 నెలలలో పూర్తిచేసి వరంగల్ - కరీంనగర్ జిల్లాలకు సాగు నీరందిస్తామని నాటి సిఎం చెప్పినట్లు ఆయన గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు దిగువన ఓ ఆనకట్ట నిర్మిస్తే ఎనిమిది నెలలపాటు నీరు తీసుకునే అవకాశం ఉన్న ఆ పని చేయలేదన్నారు. అయితే వాస్తవానికి అప్పట్లో దేవాదులకు రూపకల్పన చేసింది నాటి భారీ నీటిపారుదల శాఖమంత్రి కడియం శ్రీహరి అని చంద్రబాబు పలు సభలలో ప్రకటించారు. కడియం ప్రస్తుతం తెలంగాణ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆనాటి అధికారులతో కలసి కడియం ఆస్ట్రియా దేశం వెళ్లి అధ్యయనం చేసి దేవాదులకు రూపకల్పన చేశారు. గోదావరి నదిపై బ్యారేజి నిర్మించాలన్న ఆలోచన కడియం శ్రీహరి ఎందుకు చేయలేదని తెలంగాణ వాదులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ మేధావిగా చెప్పుకునే కడియం శ్రీహరి ఆనాడు చంద్రబాబు సర్కారు తీరుపై ఎందుకు మౌనంగా ఉన్నారనే వాదనలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుత కెసిఆర్ క్యాబినెట్ లో కొనసాగుతున్న తుమ్మల నాగేశ్వర రావు - పోచారం శ్రీనివాసరెడ్డి - తల సాని శ్రీనివాస్ యాదవ్ వంటి వారు ఆ రోజు కూడ మంత్రులుగా ఉన్న సంగతిని వారు గుర్తుచేస్తున్నారు. వీరంతా చంద్రబాబు వైఖరిని ప్రశ్నించకపోగా ఆయనను ఆకాశానికెత్తారు. పైగా ఇపుడు ప్రశ్నిస్తున్న వారికి సరైన సమాధానం చెప్పలేక అది ఆనాటి సంగతి దానిని ఆ పార్టీ లైన్ అని కొందరు, ప్రభుత్వంలో ఉంటూ ఎలా ప్రశ్నిస్తామని మరికొందరు తప్పించుకుంటున్నారు.
2004లో చంద్రబాబు పాలన ముగిసి వైఎస్ ఆర్ నాయకత్వంలో ఆంధ్ర ప్రదేశ్ లో నూతన ప్రభుత్వం ఏర్పడింది. తెలంగాణ వెనకబాటుతనానికి ప్రధానంగా సాగునీటి ప్రాజెక్టులు నిర్మించకపోవడమే కారణమన్న వైఎస్ ఆర్ జలయజ్ఞం అనే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిని పూర్తిచేసే బాధ్యతను తెలంగాణ ప్రాంతానికి చెందిన పొన్నాల లక్ష్మయ్యకు అప్పగించారు. వైఎస్ - రోశయ్యలు ముఖ్యమంత్రులుగా పనిచేసిన కాలంలో లక్ష్మయ్య భారీ నీటి పారుదల శాఖమాత్యులుగా పనిచేశారు.కెసిఆర్ చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో పేర్కొన్న ప్రాణహిత చేవేళ్ల - కంతనపల్లి - వంటి కీలక ప్రాజెక్టు లన్ని పొన్నాల నాయకత్వంలోనే రూపుదిద్దుకున్నాయి. తెలంగాణకు అన్యాయం చేసే పులిచింతల, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యూలేటర్ - ఎస్ ఎల్ బిసి - జూరాల తదితర ప్రాజెక్టుల సూత్రదారి పొన్నాల లక్ష్మయేనని స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన తరువాత వచ్చిన సుదర్శన్ రెడ్డి ఏనాడు కూడ తెలంగాణ ప్రాజెక్టులను పట్టించుకోలేదు. కనీసం ఆయన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు సాగు నీరు అందించే నిజాంసాగర్ - ఎస్ ఆర్ ఎస్పీ ప్రాజెక్టులను కూడ పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా జలయజ్ఞం పనులకి సంబందించి మొబిలేజేషన్ అడ్వాన్సులలో వీరి వాటా వీరు తీసుకుని నోర్లు మూసుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ ముఖ్యమంత్రుల వద్ద పొన్నాల లక్ష్మయ్య - సుదర్శన రెడ్డిలు పనిచేసి తెలంగాణకు అన్యాయం చేస్తే చంద్రబాబు వద్ద పనిచేసిన కడియం - తుమ్మల - పోచారం తదితరులు తీరని నష్టం కలిగించారని తెలంగాణ వాదులు మండిపడుతున్నారు.
మొత్తానికి గత రెండు దశాబ్దాలుగా తెలంగాణ నేతలే నీటిపారుదల శాఖ మంత్రులుగా ఉన్న నేపథ్యంలో కేసీఆర్ చేసిన ఆరోపణల్లో పసలేదన్న వాదన వినిపిస్తోంది. పైగా అప్పటి ముఖ్యమంత్రులు తీరు వేరు.. ప్రస్తుతం కేసీఆర్ లా మంత్రులను డమ్మీలు చేసి అంతా తానై వ్యవహరించే ముఖ్యమంత్రులు కారు.. మంత్రులకు బాధ్యతలు అప్పగించి వారిపై నమ్మకంపెట్టి తాము పర్యవేక్షణ చేసేవారు. అందుకే అప్పట్లో నీటి పారుదల మంత్రిగా ఉన్న కడియం విదేశాల్లో అధ్యయనం చేసి దేవాదులకు రూపకల్పన చేశారు. కాబట్టి సమైక్య పాలకులపై నెడుతున్న పాపంలో తెలంగాణ మంత్రుల వాటా ఎంతన్నదీ కీలకమే.