అటు రాజ‌ముద్ర‌.. ఇటునోటిఫికేష‌న్ మోత‌!

Update: 2018-08-31 05:36 GMT
కేసీఆర్ ప్లానింగ్ ఎంత ప‌క్కాగా ఉంటుందో ప్ర‌త్యేకించి చెప్పాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. కొంద‌రు ప్ర‌ముఖ సినీ ద‌ర్శ‌కులు తాముతీయ‌బోయే సినిమాకు సంబంధించిన సినిమా స్కిప్ట్‌ను ఎంత ప‌క్కాగా రెఢీ చేసుకుంటారో అదే తీరులో కేసీఆర్ వ్య‌వ‌హార‌శైలి ఉంటుంది.

ముందుస్తు ఎన్నిక‌ల‌కు వెళ్లాల‌న్న ఆలోచ‌న చేసిన కేసీఆర్‌.. అందులో భాగంగా ఎప్పుడేం చేయాలన్న దానిపై పిచ్చ క్లారిటీతో ఉన్న‌ట్లుగా క‌నిపిస్తోంది. ఎలాంటి త్రోటుపాటు లేకుండా ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా జ‌రుగుతున్న ప‌రిణామాలు చూస్తుంటే.. కేసీఆర్ ప్లానింగ్ ఎంత క్ర‌మ‌బ‌ద్ధంగా సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవ‌చ్చు.

ముంద‌స్తు నేప‌థ్యంలో స‌రికొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌పై ఢిల్లీకి వెళ్లి ప్ర‌ధాని మోడీతో భేటీ అయి.. ఆయ‌న్ను ఒప్పించి ఫైలు మీద సంత‌కం పెట్టేలా చేయ‌ట‌మే కాదు.. మిగిలిన శాఖ‌ల‌న్నీ ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా సంత‌కాలు పెట్టేయ‌టం.. కొర్రీలు ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్న వైనం క‌నిపిస్తుంది.

ముంద‌స్తు నేప‌థ్యంలో ఓవైపు భారీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేస్తూనే.. పాల‌నా ప‌రంగా తీసుకోవాల్సిన మార్పులు రాత్రి.. ప‌గ‌లు అన్న తేడా లేకుండా చేస్తున్న కేసీఆర్‌.. ఇప్ప‌టికే ప‌లు కీల‌క ప‌ద‌వుల్లో ఎవ‌రుఉండాల‌న్న అంశానికి సంబంధించి గ‌తంలో ఎప్పుడో సిద్ధం చేసుకున్న కేసీఆర్‌.. తాజాగా వాటిని అమ‌లు చేస్తున్నార‌ని చెప్పాలి.

ఓవైపు కొంగ‌ర‌లో భారీ బ‌హిరంగ స‌భ‌.. మ‌రోవైపు ఐఏఎస్.. ఐపీఎస్ ల బ‌దిలీల‌తో పాటు.. మ‌రిన్ని నిర్ణ‌యాల్ని ఆయ‌న చ‌క‌చ‌కా తీసేసుకుంటున్నారు. ఇదంతా ఓ ప‌క్క సాగుతూనే.. మ‌రోవైపు తెలంగాణ‌లోని యువ‌త త‌న‌వైపున‌కు తిప్పుకునేందుకు ఆయుధంగా ఉన్న జోన‌ల్ వ్య‌వ‌స్థ‌ను ద‌గ్గ‌ర ఉండి మ‌రీ ఫైలు ప్ర‌ధాని టేబుల్ మీద‌కు వ‌చ్చేలా చేయ‌ట‌మే కాదు.. కేసీఆర్ కార‌ణంగా రాష్ట్రప‌తి కోవింద్ సైతం సంత‌కం పెట్టేశారు.

కొత్త జోన‌ల్ వ్య‌వ‌స్థ‌కు కేంద్రం ఒకే చెప్పేసి రాజ‌ముద్ర వేసిన వేళ‌.. కేసీఆర్ మ‌రో సంచ‌ల‌నానికి తెర తీశారు. ఎంతోకాలంగా పెండింగ్‌ లో ఉన్న జూనియ‌ర్ పంచాయితీ కార్య‌ద‌ర్శ‌కుల పోస్టుల‌కు పంచాయితీ రాజ్ నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఇంత‌కూ ఎన్ని ఖాళీల‌కో తెలుసా?  ఏకంగా 9355 పోస్టుల భ‌ర్తీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు. అంతేనా.. ఈ పోస్టుల భ‌ర్తీకి దాఖ‌లు చేయాల్సిన అప్లికేష‌న్ గ‌డువును సెప్టెంబ‌రు 11గా పెట్ట‌టం చూస్తే.. కేసీఆర్ ఎంత ప‌క్కా ప్లానింగ్లో ఉన్నారో ఇట్టే తెలుస్తుంద‌ని చెప్పాలి.
Tags:    

Similar News