ఏపీ ప్రభుత్వాన్నిటార్గెట్ చేసిన తెలంగాణ మంత్రి

Update: 2022-05-13 05:40 GMT
ఎవరి సమస్యలు వారివి. కానీ.. తమ సమస్యల గురించి ప్రస్తావించినట్లే ప్రస్తావించి.. మధ్యలో ఏపీని లాగే ధోరణి ఈ మధ్యన తెలంగాణ మంత్రులకు ఎక్కువైంది. మొన్నటికి మొన్న హైదరాబాద్ బడాయి గురించి చెప్పుకునే క్రమంలో.. ఏపీలో ఎంతటి దారుణ పరిస్థితి ఉందో తెలుసు కదా? అంటూ అవసరం లేని అనవసరమైన వ్యాఖ్యల్ని మంత్రి కేటీఆర్ చేయటం.. ఆ తర్వాత నాలుక్కర్చుకొని.. ఏపీ డెవలప్ మెంట్ లో దూసుకెళుతుందంటూ కవరింగ్ ట్వీట్ చేయటం తెలిసిందే.

తాజాగా మరో తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఇదే తీరునను ప్రదర్శించారు. కేంద్రంతో ఈ మధ్యన లొల్లి పెట్టుకున్న వేళ.. మోడీ సర్కారు చెప్పినప్పటికి తాము ఫాలో కావట్లేదని.. అదేమంటే.. రైతుల సంక్షేమం అంటూ చెప్పిన ఆయన.. ఏపీ ప్రస్తావనను తీసుకొచ్చి.. 'ఏపీ ఒప్పుకుంది కానీ తెలంగాణ మాత్రం ససేమిరా అన్నది' అంటూ చేసిన వ్యాఖ్యల ఇప్పుడు జగన్ సర్కారుకు చిరాకు పుట్టేలా చేస్తోంది.

కేంద్రం తమకు రూ.5వేల కోట్ల రుణ పరిమితి ఆశ చూపించటంతో ఏపీలో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడుతున్నట్లుగా వేముల ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీలో వచ్చే ఆర్నెల్లలోవిద్యుత్ మీటర్లుపెట్టటం పూర్తి చేస్తారన్నారు. కేంద్రం తమకు ఆశ చూపించినప్పటికి మోటార్లకు మీటర్లు పెట్టే విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఒప్పుకోలేదన్నారు. రూ.5వేల కోట్లు ఇవ్వకున్నా ఫర్లేదు కానీ తమకు రైతులు.. వారి సంక్షేమమే ముఖ్యమంటూ మోడీ సర్కారు చెప్పిన మాటలకు ఒప్పుకోలేదన్నారు.

తెలంగాణ ముఖ్యమంత్రి గొప్పతనాన్ని వివరించేందుకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ప్రధాని మోడీ ఒత్తిడికి లొంగినట్లుగా టీ మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. తమ గురించి తాము గొప్పలు చెప్పుకుంటే ఎవరికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కానీ.. ఆ గొప్పలు ఎదుటివారిని తక్కువ చేసేలా చేయటంపైనే అభ్యంతరం ఉంటుందన్న విషయాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి లాంటి వారు గుర్తిస్తే మంచిది.

పాలమూరుకు నీళ్లు రాకుండా క్రిష్ణా జలాల విషయంలోకేంద్రం అన్యాయం చేస్తుందన్న ఆయన..ఏపీ.. కర్ణాటకలోని ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం తెలంగాణకు మాత్రం ఇవ్వలేదన్నారు. బీజేపీ ఎంపీలు అర్వింద్.. బండి సంజయ్ లు చేతనైతే తెలంగాణ ప్రాజెక్టులకు జాతీయ హోదా తెప్పించాలన్నారు.

ప్రధాని మోడీదేశాన్ని అదానీ.. అంబానీలకుఅమ్ముతున్నారని.. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన పరిశ్రమలను గుజరాత్ కు తరలించుకుపోతుంటే బీజేపీ రాష్ట్ర ఎంపీలు ఏమీ చేయలేకపోతున్నారన్నారు.
Tags:    

Similar News