పాలనలో ప్రత్యేకం.. రాజకీయంలో చైతన్యం.. హక్కులు సాధించుకోవడంలో పోరాట పటిమను అలవర్చుకున్న తెలంగాణ ఇప్పుడు భవనాలను నిర్మించడంలోనూ గుర్తింపు తెచ్చుకుంటోంది. ఇప్పటికే యాదాద్రి దేవాలయం, కలెక్టరేట్ల భవనాలు నిర్మించిన ప్రభుత్వం ఇప్పడు అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర సచివాలయాన్ని రూపొందిస్తోంది. ఈ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఆ రోజున దీనిని ప్రారంభించనున్నారు. అత్యంత హంగులు, ఆర్భాటాలు కలిగిన ఈ భవనం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందని బీఆర్ఎస్ నాయకులు చెబుతున్నారు. 6 అంతస్తలుు.. 34 గుమ్మాటాలు.. కలిగిన ఈ భవనం కు సంబంధించిన ఫొటోలు తాజాగా అర్కిటెక్ట్ ఆస్కార్ పొన్ని, నిర్మాణ సంస్థ షాపూర్జీ పల్లోంజి లు విడుదల చేశారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత.. నిజాం కాలం నాటి భవనాల్లోకి తాను వెళ్లనని భీష్మించుకొని కూర్చున్న కేసీఆర్ కొత్త సచివాలయ నిర్మాణం చేపట్టడానికి రెడీ అయ్యారు. ఇందు కోసం రూ.400 కోట్లు కేటాయించారు. కానీ ఆ తరువాత ఈ అంచనా రూ.1300 కోట్లకు చేరుకుంది. అయితే ఇది సచివాలయమా..? రాజభవనమా..? అన్న రీతిలో తీర్చిదిద్దుతున్నారు. సీఎం చాంబర్ తో సహా అన్ని గదులు ప్రత్యేకంగా నిర్మించారు.
ట్యాంక్ బండ్ వైపు ప్రధాన ద్వారం ఉండేలా నిర్మించిన ఈ సచివాలయం పూర్తి విస్తీర్ణం 26.98 ఎకరాలు. ఇందులో భవనాన్ని దీర్ఘ చతురస్రాకారంలో నిర్మించామని చెన్నైకి చెందిన అర్కిటెక్ సంస్థ తెలిపింది. అతిథుల కోసం పోర్టికో టవర్స్, అర్రమెంటల్ డోమ్స్, కార్వింగ్స్ సౌకర్యాలు ఉన్నాయి.
సీఎం చాంబర్ తో పాటు మీటింగ్ హాల్, వీఐపీలతో మాట్లాడే రూం అన్నీ అత్యాధునికంగా ఉన్నాయి. ఇందులోకి వస్తే ఒక లగ్గరీ హోటల్ లోకి వచ్చినట్లే అనిపిస్తుంది. సీఎం కేసీఆర్ లక్కీ నెంబర్ 6 అయినందున చివరి అంతస్తులో కేసీఆర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు.
భవనం ముందు అందంగా కనిపించేందుకు అగ్రా, ధోల్ పూర్ నుంచి తెచ్చిన ఎరుపు, గోధుమ రంగు రాళ్లను ఏర్ాపటు చేశారు. రాజ భవనాన్ని తలపించేలా డెక్కనీ కాకతీయ శైలిలో రూపొందించారు. 150 ఏళ్లు నిలిచేలా , ప్రకంపనలు తట్టుకునేలా డిజైన్ చేశారు. ఇంకా ఇందులో నీలకంఠేశ్వరాలయం, వనపర్తి ప్యాలెస్, సారంగాపూర్ హనుమాన్ ఆలయాన్ని నిర్మించారు. ఈ భవనం పైనుంచి చూస్తే హుస్సేన్ సాగర్ పూర్తి వ్యూ కనిపించేలా డిజైన్ చేశారు. సచివాలయం నిర్మాణంతో పాటు చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను సైతం సరికొత్తగా అభివృద్ధి చేపట్టాలని కేసీఆర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు.
ప్రతి నిర్మాణంలో తన మార్క్ కనిపించేలా కేసీఆర్ చర్యలు తీసుకుంటారు. అందుకే ఆయన దగ్గరుండీ ఈ భవన నిర్మాణాన్ని పర్యవేక్షిస్తున్నారు. మూడు రోజుల కిందట ఇక్కడ పర్యటించిన ఆయన గంట సేపు భవనాన్ని పరిశీలించారు. ఇక ఫిబ్రవరి 17న ఈ కార్యాలయ ప్రారంభానికి ఇద్దరు సీఎంలు వస్తున్న విషయం తెలిసిందే. దీంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలకు ఈ భవనం ను పరిచయం చేసే విధంగా ప్రచారం చేసుకోనున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.