చరిత్రలోకి వెళ్తే రాజులు ఎన్నో కట్టడాలను నిర్మించారు. ఈ రోజుకీ వాటిని మనం వాడుతూనే ఉన్నాం. అంటే అన్ని వందల ఏళ్ల పాటు అవి నిలిచి ఉన్నాయంటే వాటి గొప్పతనాన్ని అర్ధం చేసుకోవాలి. అలాగే పనితనాన్ని మెచ్చుకోవాలి. ఆనాటి రాజుల అభిరుచి ఆకాంక్షలను కూడా ప్రశంసించాలి.
ఇపుడు చూస్తే ఆధునిక కాలంలో తెలంగాణా రాష్ట్రంలో ఒక అద్భుత ఆవిష్కరణను జనం కళ్ళ ముందు ఉంచిన ఘనతను మాత్రం అచ్చంగా ముఖ్యమంత్రి కేసీయార్ సొంతం అనే చెప్పాలి. ఆయన నూతన సచివాలయం నిర్మాణం కోసం నడుం బిగించారు అంటేనే ఎన్నో విమర్శలు పెదవి విరుపులు వినిపించాయి. కానీ ఈ రోజుకు పూర్తి అయిన నూతన సచివాలయం చూస్తే రెండు కళ్లూ సరిపోవడంలేదు.
అసలు ఇంతలా ఎందుకు పంతం పట్టి మరీ కేసీయార్ కొత్త సచివాలయాన్ని నిర్మించాలనుకున్నారు అంటే తెలంగాణా అస్తిత్వాన్ని మరింతంగా వెలుగులోకి తీసుకురావాలన్న ఉద్దేశ్యంతోనే ఇలా చేశారు అని అంటారు. ఇక కేసీయార్ మానస పుత్రికగా కూడా దీన్ని పేర్కొంటున్నారు.
మొత్తం 28 ఎకరాలా విస్తీర్ణాన్ని తీసుకుని అందులో జస్ట్ పది శాతం అంటే రెండు నుంచి మూడు ఏకరాలలో మాత్రమే సచివాలయం భవనాలను కట్టారు. మిగిలినది అంతా పచ్చని ఉద్యానవనాలు, ఫౌంటెన్స్, లాంజ్ లకు కేటాయించారు. అంటే ప్రకృతి పచ్చదనానికి ఏ మాత్రం ఇబ్బంది కలగకుండా సుందరమైన సచివాలయాన్ని కేసీయార్ ఏర్పాటు చేశారన్న మాట.
ఈ సచివాలయం డిజైన్స్ ఎలా ఎంపిక చేశారు దీని వెనక కధ ఏంటి అంటే ఒక యూట్యూబ్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణా నాయకుడు వేముల ప్రశాంత్ రెడ్డి చాలా ఆసక్తికరమైన విషయాలనే పంచుకున్నారు. ఆర్కిటెక్ట్స్ మొత్తం ఇరవై దాకా డిజైన్స్ ఇస్తే అందులో నుంచి కేసీయార్ ఒక డిజైన్ ని ఎంపిక చేశారు. అదంతా విపరీతంగా శ్రమించి ఎంపిక చేసిన డిజైన్ అని చెబుతున్నారు. అదే ప్రస్తుతం అందరి కళ్లకు కనిపిస్తున్న తెలంగాణా సచివాలయం అని చెప్పాలి.
ఇక రాజస్థాన్ నుంచి ఏకంగా వేయి లారీ లోడ్లలో రెడ్ స్టోన్స్ తెప్పించి మరీ సచివాలయ నిర్మాణంలో ఉపయోగించారు. ఇందులో ఏడు వందల లారీల లోడ్ మత్రమే కట్టడానికి ఉపయోగించకగా మిగిలీంది వేస్టేజ్ గా పోయిందని చెబుతున్నారు.
ఇక దీని పనితనం గురించి చెబుతూ ఉత్తరాదినే అలాంటి వారు దొరుకుతారని, వారిని రప్పించి మరీ ఒక తపస్సుగా దీన్ని కేసీయార్ చేపట్టారని ఆయన వివరించారు. దాదాపుగా ఆరేడు వందల కోట్ల రూపాయలతో ఈ నూతన సచివాలయం నిర్మాణం జరుపుకుంది అని ఆయన వెల్లడించారు.
ఇక సచివాలయం ప్రత్యేకతలు ఏంటి అంటే మొత్తం డిపార్ట్మెంట్లకు ఒక్కో దానికి ఒక్కో సెమినార్ హాల్ అన్నట్లుగా నిర్మించారు. అంతే కాదు రానున్న కాలమంతా వర్చువల్ విధానంలోనే సెమినార్స్ జరుగుతాయి కాబట్టి దానికి తగినట్లుగా ధీటుగా ఈ నిర్మాణం ఉందని చెబుతున్నారు. ప్రతీ డిపార్ట్మెంట్ కి అధునాతనమైన వీడియో కాన్ఫరెన్స్ హాల్ ని ఏర్పాటు చేయించడం ఒక విశిష్టతగా చెప్పాల్సి ఉంటుంది.
ఇంత గొప్ప సచివాలయాన్ని ప్రజలకు సందర్శనార్ధం చూపిస్తామని వేముల ప్రశాంత్ రెడ్డి అంటున్నారు. తెలంగాణా ఖ్యాతి పెంచేలా కట్టామని, అది అందరికీ చూపించడమే తమ ఉద్దేశ్యమని ఆయన చెప్పారు. ముందు లాంజ్ లో హెలిపాడ్ ని కూడా ఏర్పాటు చేయడం దీని ప్రత్యేకతగా వివరించారు. తెలంగాణా కోసం పదహారు గంటల పాటు కేసీయార్ కోసం రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తి కేసీయార్ అని కొనియాడారు.
విపక్షాలు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నాయని, తెలంగాణా సచివాలయం హైందవ సంప్రదాయనికి సంబంధించినవి ఉన్నాయని అన్నారు. అలాగే నిజామీ ఆర్కి టెక్చర్ ఉందని అన్నారు ఈ సచివాలయం నిర్మాణం కోసం రోజుకు మూడు వేల మందికి పైగా పనిచేశారు. ఏకంగా ఇరవై నెలలు పనిచేసారు. ఇరవై నెలలలో ఈ సచివాలయాన్ని నిర్మించామని ఆయన వివరించారు. రెండు కరోనాలు ఈ మధ్యలో రావడంతో ఆరు నెలలు వేస్ట్ గా పోయిందని ఆయన అన్నారు. మొత్తానికి కేసీయార్ ఒక అద్భుతాన్నే ఆవిష్కరించారని అంటున్నారు.
Full View