ప్రపంచాన్ని వణుకు పుట్టిస్తున్న కరోనా విషయంలో ఏ చిన్నపాటి నిర్లక్ష్యం తగదు. ఒక పొరపాటుకు సైతం భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు. ఈ విషయాన్ని కరోనా గురించి ఏ మాత్రం అవగాహన ఉన్నా చెప్పేస్తారు. అలాంటిది.. తెలంగాణ సర్కారు లైట్ తీసుకుందా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో తీసుకురావాల్సిన బిల్లు.. మరో ముఖ్యమైన బిల్లుల కోసం ఒక రోజు అసెంబ్లీ.. మరో రోజు మండలిని సమావేశ పరుస్తున్న వైనం తెలిసిందే.
ఈ రోజు శాసన సభ.. రేపు (బుధవారం) శాసనమండలి సమావేశాలు జరుగుతున్నాయి. ఒక రోజు సమావేశం కోసం ఏర్పాట్లు అన్ని చేసినా.. కోవిడ్ నేపథ్యంలో కరోనా పరీక్షలు మాత్రం చేయకపోవటం గమనార్హం. ఒక రోజు సమావేశాల సందర్భంగా సభ్యులు తప్పనిసరిగా పరీక్షలు చేయించుకోవాలన్న నిబంధనను పక్కన పెట్టేయటం ఆశ్చర్యకరంగా మారింది. ఒక రోజు సమావేశాలే కదా? పరీక్షలు అక్కర్లేదన్న నిర్ణయాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి తీసుకున్నారు.
సభలకు హాజరయ్యే సభ్యులు.. మీడియా ప్రతినిధులు.. పోలీసు సిబ్బంది.. అధికారులు ఎవరైనా సరే కోవిడ్ లక్షణాలు కనిపిస్తే.. పరీక్షలు చేసుకోవాలని సూచన చేశారు. కోవిడ్ లక్షణాలు ఉన్న వారు.. సభకు వచ్చారంటేనే పరీక్షల మీద ఆసక్తి లేనట్లు.అలాంటిది అక్కడకు వచ్చి మరీ పరీక్షలు చేయించుకుంటారా? అన్నది సందేహమే. ఒకవేళ చేయించుకున్నారే అనుకుందాం. వారికి పాజిటివ్ గా తేలిందనే అనుకుందాం. అదే జరిగితే ఎంత ముప్పు? అన్నది ప్రశ్న.
అసెంబ్లీకి హాజరయ్యే ప్రజాప్రతినిధులు.. వారి కోసం వచ్చే సందర్శకులు.. అధికారులు.. మీడియా ప్రతినిధుల్లో చాలామంది యాభై దాటిన వారే ఎక్కువ మంది ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఒక్క రోజు సమావేశాలే కదా అని తేలిగ్గా తీసుకోవటానికి లేదు. కానీ.. అందుకు భిన్నంగా తీసుకున్న నిర్ణయం విస్మయానికి గురి చేస్తుంది. మిగిలిన సందర్భాల్లో రిస్కులు తీసుకున్నా ఫర్లేదు కానీ.. కరోనా లాంటి ఖతర్నాక్ వైరస్ తో ఆటలు ఏ మాత్రం మంచిది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.