మహిళలకు చట్ట సభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న అంశం ఎప్పటి నుంచో పెండింగులో ఉంది. అసెంబ్లీలు - లోక్ సభలో మహిళలకు రిజర్వేషన్ లేనప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో మాత్రం పార్టీలు పెద్ద పీట వేస్తున్నాయి.
తెలంగాణలో తాజాగా పంచాయితీ ఎన్నికల కోసం మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించారు. గ్రామస్థాయిలో అయితే.. మహిళలను సర్పంచిలుగా ఎన్నుకున్నా వారి తరఫున భర్తలో - తండ్రులో అధికారం చెలాయించడం తెలిసిందే. అసెంబ్లీలు - లోక్ సభ అయితే ఇలా చెలాయించడం అంత ఈజీకాదు.
తాజాగా తెలంగాణలో గ్రామ పంచాయతీలకు రిజర్వేషన్ల కసరత్తులు ఎట్టకేలకు పూర్తయ్యాయి. సోమవారం నాడు పంచాయతీ రిజ్వషన్ల ఎంపికను పూర్తిచేసి ఎస్టీ - ఎస్సీ - బీసీ - వర్గాల వారీగా ప్రభుత్వం రిజర్వేషన్ల జాబీతాను విడుదల చేసింది. దీంతో గ్రామ పంచాయతీ ఎన్నికలకు లైన్ క్లియర్ అయింది. రాష్ట్రంలో మొత్తం 12751 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో 50శాతం సర్పంచ్ పదవులకు రిజర్వషన్లను మహిళలకు ప్రకటించారు. 6378 సర్పంచ్ పదవులను మహిళ కోటా కింద రిజర్వ్ చేశారు. మిగిలిన 6373 పంచాయతీ సర్పంచ్ స్ధానాలను ఓపెన్ కేటగిరి కింద ప్రకటించారు . ఈ స్ధానాల్లో పురుషులతోపాటు మహిళలు కూడా పోటీ చేయవచ్చు.
రాష్ట్రంలో కేటగిరి వారీగా రిజర్వేషన్లు ప్రకటించిన స్ధానాలను పరిశీలిస్తే షెడ్యూల్ ఏరియా ప్రాంతాల్లో ఉన్న 1281 గ్రామ పంచాయతీలను ఎస్టీలకే కేటాయించారు. ఇందులో మహిళలకు 641 స్ధానాలు రిజర్వ్ చెశారు. వంద శాతం ఎస్టీ జనాభా ఉన్న 1177 గ్రామ పంచాయతీలను కూడా ఎస్టీలకే కేటాయించారు. ఇందులో కూడా మహిళలకు 589 పంచాయతీ సర్పంచ్ స్థానాలను రిజర్వ్ చేశారు. షెడ్యూల్ ఏరియాలో ఉన్న మొత్తం 2458 గ్రామ పంచాయతీల్లో పూర్తిగా ఎస్టీలే పోటీ చేయనున్నారు.
నాన్ షెడ్యూల్ ఏరియాలో ఉన్న10293 గ్రామ పంచాయతీల్లో ఎస్టీ - ఎస్సీ - బీసీ వర్గాలకు - ఇతరుల కు కేటాయింపులు చేశారు.ఇందులో అన్ రిజర్వ్ కింద 5147గ్రామ పంచాయతీలు పోగా మిగిలిన వాటికి రిజర్వేషన్లు ప్రకటించారు. ఎస్టీలకు 688 గ్రామ పంచాయతీలు కేటాయించారు. ఇందులో ఆ వర్గం మహిళలకు 344 పంచాయతీలు రిజర్వ్ చేశారు. ఎస్టీలకు 2113 గ్రామ పంచాయతీలు కేటాయించారు. ఇందులో ఆ వర్గం మహిళలకు 1057పంచాయతీలు కేటాయించారు. బీసీలకు 2345 గ్రామ పంచాయతీలు కేటాయించారు. అందులో బీసీ మహిళలకు 1173 పంచాయతీ సర్పంచ్ పదవులు రిజర్వ్ చేశారు. అన్ రిజర్వ్ కింద ఉన్న 5147గ్రామ పంచాయతీల్లో 2574 గ్రామ పంచాయతీ సర్పంచ్ స్ధానాలను మహిళలకు రిజర్వ్ చేశారు.