తొలిసారి ఏపీ నడిబొడ్డున తెలంగాణ పోలీసుల పరేడ్

Update: 2020-01-25 04:23 GMT
రెండు తెలుగు రాష్ట్రాలు గా విడి పోయిన తర్వాత.. ఇప్పటి వరకూ ఎప్పుడు లేని రీతిలో ఈసారి గణతంత్ర వేడుకల సందర్భంగా ఒక ఆసక్తికర సన్నివేశం కనిపించనుంది. జనవరి 26న నిర్వహించే గణతంత్ర దినోత్సవాల్లో తొలిసారి తెలంగాణ పోలీసులు ఏపీలో నిర్వహించే పరేడ్ లో పాల్గొన బోతున్నారు.

రిపబ్లిక్ డే సందర్భంగా వివిధ రాష్ట్రాలకు చెందిన పోలీసులు ఏపీకి వస్తారు. పరేడ్ లో పాల్గొంటారు. అయితే.. విభజన తర్వాత ఇప్పటి వరకూ తెలంగాణ పోలీసులు పరేడ్ లో పాల్గొన్నది లేదు. ఈ లోటును తీర్చేందుకు వీలుగా ఈసారి తెలంగాణ పోలీసులు ఏపీ నడిబొడ్డున నిర్వహించే పరేడ్ లో పాల్గొంటారు. కవాతు నిర్వహించనున్నారు.

ఈ పరేడ్ లో ఏపీ ప్రభుత్వం తయారు చేయించిన ప్రత్యేక శకటాన్ని ప్రదర్శించనున్నారు. దిశ చట్టాన్ని ఏపీ సర్కారు రూపొందించిన నేపథ్యంలో.. ఆ చట్టంలోని అంశాలతో కూడిన ప్రత్యేక శకటాన్ని తయారు చేయించారు. ఇది పరేడ్ లో ప్రత్యేక ఆకర్షణ గా నిలవనుంది. సాయుధ.. త్రివిధ దళాలకు చెందిన పరేడ్ తో పాటు వివిధ ప్రభుత్వ శకటాల ప్రదర్శన రిహార్సల్స్ ను నిర్వహించారు. ఈసారి రిపబ్లిక్ డే వేడుకల్లో తెలంగాణ పోలీసులు ప్రత్యేక ఆకర్షణ కానున్నట్లు చెబుతున్నారు.


Tags:    

Similar News