మహమ్మారి వైరస్ విజృంభన తెలంగాణలో తీవ్రంగా ఉంది. రోజుకు వందకు పైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా 4 వేల మార్క్‌ను తెలంగాణ దాటింది. కొత్తగా 191 కేసులు నమోదవడంతో వీటితో కలిపి ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసులు 4,111. కేసుల పెరుగుదలతో పాటు మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే వైరస్‌తో 8 మంది మృతి చెందారు. వీటితో కలిపి ఇప్పటివరకు 156 మంది మృత్యువాత పడ్డారు.
కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీ పరిధిలో 149, మేడ్చల్‌లో 11, సంగారెడ్డిలో 11, రంగారెడ్డిలో 8, మహబూబ్ నగర్‌లో 4, జగిత్యాల, మెదక్‌లో 3 చొప్పున, నాగర్ కర్నూల్, కరీంనగర్‌లో 2 చొప్పున, నిజామాబాద్, వికారాబాద్, నల్గొండ, సిద్దిపేటలో ఒక్కో కేసు నమోదయ్యాయని బుధవారం వైద్యారోగ్య శాఖ ఫ్రకటించింది.
ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్‌గా ఉన్న కేసులు 2,138 ఉండగా, ఇప్పటివరకు డిశ్చార్జైన వారి సంఖ్య 1,817కి చేరింది. ఈ విధంగా తెలంగాణలో మహమ్మారి వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఈ వైరస్ బారిన వైద్యులు, జర్నలిస్టులు పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. నిరంతరం ప్రజల కోసం పని చేసే వీరు వైరస్ బారిన పడుతుండడంతో భయాందోళనలు రేపుతున్నాయి.