సోష‌ల్ మీడియా డౌట్స్ : ఆ ..ఉద్య‌మం ఎవ‌రు చేశారు?

Update: 2022-05-09 01:30 GMT
జై తెలంగాణ అని ప‌లికిన ప‌లుకు ఇంకా మార్మోగుతూనే ఉంది. ఆ విధంగా ఆ రోజు ఎన్నో ఒత్తిళ్లు, స‌వాళ్లు వీటితోపాటు పోలీసుల బూటు చ‌ప్పుళ్ల ఆంక్ష‌లు.. తుపాకీ ధ్వ‌నుల ర‌ణ‌గొణ వాదాలు.. ఇలా ఎన్నో విని విని అల‌సిపోయిన తెలంగాణ గుండె కు అమ‌రత్వం ద‌క్కింది. త్యాగం విలువ త‌గ్గింది కూడా! క‌నుక తెలంగాణ ఏ ఒక్క‌రితో కాదు అంద‌రితో ! ఈ మాట ధ‌ర్నాచౌక్ ఒప్పుకుంటుంది. ఈ మాట జ‌గిత్యాల ఒప్పుకుంటుంది.. ఇంద్ర‌వెల్లి ఒప్పుకుంటుంది.. ఆదిలాబాద్ ఒప్పుకుంటుంది..

కోటినొక్క దేవ‌త‌లూ కొలువుండిన నేల ఒప్పుకుంటుంది కానీ కొంద‌రు ఒప్పుకోవ‌డం లేదు. ముఖ్యంగా తెలంగాణ తెచ్చింది మేమే అని అంటున్న‌రు..ఇదే బాధ చాలా మందిలో ఉంది. ఆ రోజు తెలంగాణ కొట్లాట‌లో భాగంగా మీడియా విడిపోయింది.  పెట్టుబ‌డి వ‌ర్గాలు విడిపోయి, ఎవ‌రి దారి వారే అన్న విధంగా ఉన్నాయి. నాయ‌క‌గ‌ణం మాత్రం  పైకి విడిపోయి లోప‌ల క‌లిసి ఉన్నాయి అన్న విమ‌ర్శ‌లు ఇవాళ్టికీ వినిపిస్తున్నాయి. మ‌రి! త్యాగాల తెలంగాణ‌ను తీసుకువచ్చింది ఎవ‌రు ? ఈ విజ‌యం ఒక్క కేటీఆర్ ది కాదు..

ఈ విజ‌యం ఒక్క కేసీఆర్ ది కాదు. ఆ మాట‌కు వ‌స్తే ఈ విజ‌యం ఎవ్వ‌రిదీ కాదు అంద‌రిదీ అని అరుస్తున్నా వినిపించుకోవ‌డం లేదు కొంద‌రు. ఇదే బాధ‌ను ఇదే గోస‌ను గుండెల‌విసేలా వినిపిస్తున్న‌రు సోష‌ల్ మీడియా యాక్టివిస్టులు కొంద‌రు..వారి బాధ‌కు మ‌రియు ఆవేద‌న‌కు అర్థం చెప్పే ప్ర‌యత్న‌మే ఈ అక్ష‌ర రూపం.

తెలంగాణ ఉద్య‌మం కొన్ని ప్ర‌త్యేక సంద‌ర్భాల మేళ‌వింపు. నీళ్లు, నిధులు, నియామ‌కాలు అన్న‌వి ఓ ప్ర‌ధాన అజెండాగా సాగిన‌య్.. కానీ ఇప్పుడు అవే స్మ‌ర‌ణ‌కు రావ‌డం లేదు. నీళ్ల‌పై కొట్లాట ఎలా ఉన్నా ఆ పేరిట నిధుల దుర్వినియోగం మాత్రం బాగానే అవుతోంది. నియ‌మాకాల ఊసు నిన్న‌మొన్న‌టి దాకా లేనేలేదు. అలాంట‌ప్పుడు త్యాగాల తెలంగాణ‌లో అమ‌రుల స్వ‌ప్నాల‌కు విలువ ఏది? ఎక్క‌డ ? ఆహా ! వాళ్ల  క‌ల‌ల‌కు  ఇక రూపం రాదా ? భ‌విష్య‌త్ అంతా ఒక్క‌రి చేతిలో న‌లిగి పోవాల్సిందేనా అన్న‌ది కొంద‌రి ఆవేద‌న.

తెలంగాణ తెచ్చింది మేమే క‌నుక మాదే ఈ పాల‌న మాదే ఈ రాజ్యం అని చెప్ప‌డంలో ఏమ‌యినా అర్థం ఉందా.. పైకి మేం జ‌న ప‌థంలో ఉన్నాం అని చెప్పి లోప‌ల మాత్రం ప్ర‌జావ్య‌తిరేక నిర్ణ‌యాల అమ‌లుకు ప్రాధాన్యం ఇస్తున్నార‌ని ప్ర‌జా సంఘాలు గొంతెత్తుతున్నాయి. ఆఖ‌రికి ఓయూలో విప‌క్ష నేత స‌భ పెట్టుకోవాల‌న్నా ఒప్పుకోని నైజం ఎందాక  పోతుందో అని ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నాయి. ఇంత‌కూ ఈ విప‌క్షంపై వివ‌క్ష ఎందాక‌?
Tags:    

Similar News