జాతీయస్థాయిలో తెలంగాణకు తొలి గుర్తింపు..!

Update: 2015-01-20 04:51 GMT
సొంత రాష్ట్రంగా ఏర్పడితే తామేంటో.. తమ ప్రతిభ ఏమిటో దేశానికి.. ప్రపంచానికి చాటేందుకు వీలుంటుందన్న వాదనకు తగ్గట్లే తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు లభించింది. పారిశ్రామిక శిక్షణ కార్యక్రమాల నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ పరిశ్రమలు.. వాణిజ్యమండళ్ల సమాఖ్య పురస్కారం లభించింది.

కార్మికశాఖ ఈ అవార్డును అందించింది. అయితే.. ఈ గుర్తింపు విషయంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే.. ఈ అవార్డునకు గత మూడేళ్ల కాలంలో తెలంగాణలోని యువతకు మూడు వేల పారిశ్రామికకేంద్రాల్లో మూడు వేల పారిశ్రామిక కేంద్రాల్లో వెయ్యి మంది నిపుణుల ద్వారా శిక్షణ ఇప్పించారు.

దీనికి 5.3లక్షల మందికి ఉపాధి లభించినట్లుగా చెబుతున్నారు. మూడేళ్లను ప్రాతిపదికను తీసుకున్నప్పుడు ఆ క్రెడిట్‌ ఉమ్మడి రాష్ట్రానికి దక్కుతుంది. కానీ.. అందుకు భిన్నంగా ఈ మధ్యన ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర సర్కారుకు కేటాయించటం సరికాదన్న వాదన వినిపిస్తోంది. నైపుణ్య శిక్షణలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచినట్లు పేర్కొంటూ పురస్కారానికి ఎంపిక చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అంశాలకు సంబంధించిన పురస్కారాలను తెలంగాణ రాష్ట్రానికి ఎలా కట్టబెడతారని కొందరు వ్యాఖ్యానిస్తే.. మాకొచ్చే అవార్డుల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ తెలంగాణవాదులు మండిపడుతున్నారు.

Tags:    

Similar News