అదరే నిర్ణయాన్ని కాంగ్రెస్ అధినాయకత్వం తీసుకుందా? తెలంగాణ ప్రజల దశాబ్దాల కలను నెరవేర్చే క్రమంలో తాను దారుణంగా నష్టపోయిందన్న మాట పలువురి నోట వినిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ నిరాశకు గురి కాకుండా తనదైన టైం కోసం వెయిట్ చేస్తున్న కాంగ్రెస్ అధినాయకత్వం అందుకు తగ్గట్లే తాజాగా నిర్ణయం తీసుకుందా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీకి జరగాల్సిన ఎన్నికలు మరో నాలుగు నెలల్లో ముంచుకొస్తున్న వేళలో.. కాంగ్రెస్ పార్టీ కీలక నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా చెబుతున్నారు.
కాంగ్రెస్ పార్టీలో కీలక నేతల్లో ఒకరైన ప్రియాంకను తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జ్ గా ఎంపిక చేసినట్లు చెబుతున్నారు. ఇంతకాలం గ్రూపు తగాదాలతో కిందా మీదా పడే కాంగ్రెస్ నేతల నోటికి తాళాలు వేయటం.. ఏం జరిగినా.. తాము అధిష్టానం వద్ద తేల్చుకుంటామన్న రచ్చ మాటలకు చెక్ చెప్పేలా తాజా నిర్ణయం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఆ మధ్య జరిగిన యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇంఛార్జ్ గా వ్యవహరించిన ప్రియాంక.. పార్టీకి పెద్ద సీట్లు తేవటంలో సఫలం కానప్పటికీ.. పార్టీలోనూ.. నేతల్లో జోష్ ను అయితే నింపారని చెప్పాలి.
యూపీతో పోలిస్తే.. తెలంగాణ లో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని చెప్పాలి. యూపీలో కాంగ్రెస్ బలంగా లేదు. కానీ.. తెలంగాణలో అందుకు భిన్నం. బలమైన నేతలు ఉన్నారు. క్యాడర్ ఉంది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది.
అయితే.. ఈ సానుకూలతల్ని తమకు అనుకూలంగా మార్చుకోవటంలో మాత్రం విఫలమవుతోంది. అది కూడా గ్రూపు తగదాలే తప్పించి మరింకేమీ లేదు. ఇలాంటి వేళ.. నేతల్ని ఒక తాటి మీదకు తీసుకొచ్చి బలంగా పోరాడితే ఫలితం వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అయినప్పటికీ నేతలు తమ మధ్య ఉన్న పంచాయితీల నుంచి బయటకు రాని పరిస్థితి నెలకొంది. ఇలాంటి వేళ.. కర్ణాటకలో పార్టీని నడిపించిన ప్రియాంకను అక్కడి బాధ్యతల నుంచి నేరుగా తెలంగాణకు పంపుతున్న వైనం చూస్తే.. అధికారాన్ని చేజిక్కించుకోవటంలో తామెంత సీరియస్ గా ఉన్నామన్న విషయాన్ని కాంగ్రెస్ స్పష్టం చేసినట్లేనని చెప్పాలి.
ప్రియాంకను తెలంగాణ ఇంఛార్జిగా నియమిస్తే.. ఇప్పటివరకు ఎవరి దారిన వారు నడిచిన దానికి భిన్నమైన పరిస్థితులు ఖాయంగా మారతాయంటున్నారు. ప్రియాంకకు పగ్గాలు.. పార్టీ గెలుపునకు మొదటి మెట్టుగా అభివర్ణిస్తున్నారు. మరి.. ఈ నిర్ణయం అధికారికంగా వెల్లడి కావాల్సి ఉంది.