ఖాతాల్లోకి డబ్బులు వేసిన తర్వాత బ్యాంకులు ఆ డబ్బుల్ని వెనక్కి తీసుకునే అవకాశం ఉందా? అంటే లేదనే మాట పలువురి నోట వినిపిస్తుంది. అప్పుడప్పుడు ఈ తరహా ప్రచారం జరిగి ప్రజలంతా బ్యాంకుల వద్ద క్యూ కట్టటం చూసి చాలామంది నవ్వేస్తుంటారు. కానీ.. తాజాగా ఒక బ్యాంకు వ్యవహరించిన తీరు అచ్చంగా అలానే ఉంది. లాక్ డౌన్ వేళ పేద ప్రజలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కేంద్రం జన్ ధన్ ఖాతాల్లోకి డబ్బుల్ని జమ చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలంగాణలోని దాదాపు మూడు లక్షల ఖతాల్లోకి పీఎంజీకేవై కింద రూ.16 కోట్ల మొత్తాన్ని జమ చేసింది తెలంగాణ గ్రామీణ బ్యాంకు. నెలకు రూ.500 చొప్పున మూడు నెలల పాటు జమ చేస్తానని చెప్పిన కేంద్రం.. ఈ నెలలో మొదటి విడత కింద నిధుల్ని జమ చేసింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు పరిధిలోని 473 శాఖల్లోని సుమారు 9 లక్షల ఖాతాల్లో రూ.500చొప్పున నగదు జమైంది.
ఇంతవరకు బాగానే ఉన్నా.. జమ చేసిన ఖాతాల్లో 5,15,260 ఖాతాలు మినహాయించి మిగిలిన ఖాతాలన్ని అనర్హులుగా బ్యాంకు గుర్తించింది. దీంతో.. అనర్హుల ఖాతాల్లో వేసిన నగదును వెనక్కి తీసేసుకుంది. ఈ ఖాతాల్లో వేసిన మొత్తం రూ.16కోట్లుగా చెబుతున్నారు. బ్యాంకులో జరిగిన పొరపాటు వల్లే నగదును అనర్హుల ఖాతాల్లో జమ చేసినట్లుగా బ్యాంకు జీఎం చెబుతున్నారు. అయితే.. పొరపాటున ఖాతాదారుల ఖాతాల్లో వేసిన మొత్తాన్ని పలువురు ఖాతాదారులు విత్ డ్రా చేసుకోవటంతో ఆ మొత్తాన్ని ఎలా వెనక్కి తీసుకోవాలా? అన్నదిప్పుడు బ్యాంకు ముందున్న సమస్యగా చెబుతున్నారు.