స్టీఫెన్ సార్‌!...మాట నిల‌బెట్టుకోలేరండీ!

Update: 2019-03-08 04:13 GMT
తెలుగు రాష్ట్రాల మ‌ధ్య పెను సంచ‌ల‌నంగా మారిన డేటా చోరీపై తెలంగాణ స‌ర్కారు ఏర్పాటు చేసిన ప్ర‌త్యేక ద‌ర్యాప్తు సంస్థ (సిట్‌) చీఫ్ హోదాలో సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్ర నేటి సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ కేసులో కీల‌క నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్ సీఈఓ అశోక్ ఎక్క‌డ ఉన్నా ప‌ట్టేస్తామంటూ స్టీఫెన్ కాస్తంత గ‌ట్టిగానే చెప్పారు. ఈ విష‌యాన్ని కాస్తంత రీసౌండ్ వ‌చ్చేలా చెప్పేందుకు స్టీఫ‌న్‌.. ఓ ప‌ద‌బంధాన్ని వాడారు. అమ‌రావ‌తిలో ఉన్నా... అమెరికాలో ఉన్నా... అంటూ వ్యాఖ్యానించిన ఆయ‌న అశోక్ ఎక్క‌డ దాక్కున్నా ప‌ట్టేస్తామంటూ సెల‌విచ్చారు. అయితే ఈ మాట కార్య‌రూపం దాల్చే అవ‌కాశాలు లేవ‌నే చెప్పాలి. పోలీసులు త‌ల‌చుకుంటే సాధ్యం కానిదేదీ లేద‌నే చెప్పాలి. అందులోనూ విధి నిర్వ‌హ‌ణ‌లో నిక్క‌చ్చిగా వ్య‌వ‌హ‌రించి... పోలీసింగ్‌ లోనే కాకుండా కేసుల చేధ‌న‌లోనూ త‌న‌దైన ముద్ర వేసుకున్న స్టీఫెన్ ర‌వీంద్ర త‌ల‌చుకుంటే సాధ్యం కాని ప‌నే లేద‌ని కూడా చెప్పాలి.

అయితే అశోక్‌ ను అరెస్ట్ చేసే విష‌యంలో మాత్రం స్టీఫెన్‌ కు చాలా అడ్డంకులు ఉన్నాయ‌ని చెప్పాలి. ఎందుకంటే... అశోక్ తాను నెల‌కొల్పిన ఐటీ గ్రిడ్‌ ను ఏపీలో అధికార పార్టీగా ఉన్న టీడీపీకి సేవ‌లందించేందుకే వినియోగించారు. టీడీపీ ఆదేశాల మేర‌కు వ్య‌వ‌హ‌రించారు. ఈ కేసులో స్టీఫెన్ చెప్పిన‌ట్టుగా అశోక్ ప‌ట్టుబ‌డితే... మొత్తం గుట్టు ర‌ట్ట‌వ‌డ‌మే కాకుండా.. కేసులో సూత్ర‌ధారులెవ‌రు?  పాత్ర‌ధారులెవ‌రు? అస‌లు డేటా చోరీ ఏ స్థాయిలో జ‌రిగింది? అన్న అంశాలు ఈజీగానే బ‌య‌ట‌కు వ‌స్తాయి. అయితే త‌న ప‌నిని నెర‌వేర్చేందుకే కంపెనీని పెట్టిన అశోక్‌ ను టీడీపీ స‌ర్కారు... స్టీఫెన్ బృందాల‌కు అప్ప‌జెప్పేందుకు సిద్ధంగా ఉండ‌దు క‌దా. తెలంగాణ‌లో కేసు న‌మోదు కాగానే.. అప్ప‌టిదాకా హైద‌రాబాద్‌ లోనే ఉన్న అశోక్‌.. క్ష‌ణాల్లో మాయ‌మైపోయారు. కేసులో ఎంత‌మేర మాట‌ల తూటాలు పేలుతున్నా.. అత‌డి అడ్రెస్ మాత్రం జాడ లేదు.

తెలంగాణ పోలీసుల అనుమానం మేర‌కు.. అత‌డు ఏపీలోనే ఉన్నాడ‌ని తెలుస్తోంది. ఇక వైసీపీ - టీఆర్ ఎస్ నేత‌లు మాట‌ల‌ను బ‌ట్టి చూస్తే... అశోక్ ఏకంగా చంద్ర‌బాబు - లోకేశ్ ల వ‌ద్దే ఉన్నార‌న్న వాద‌నా లేక‌పోలేదు. ఈ క్ర‌మంలో అశోక్ కోసం ఏపీకి వ‌స్తే... తెలంగాణ పోలీసుల‌కు చుక్క‌లు చూపించాల్సిందేన‌ని టీడీపీ అంత‌ర్గ‌త స‌మావేశంలో ఏకంగా తీర్మానించేసిన‌ట్టుగానూ వార్త‌లు వినిపిస్తున్నాయి. కోల్ క‌తాలో న‌గ‌ర క‌మిష‌నర్‌ గా ఉన్న పోలీసు అధికారిని విచారించేందుకు ఎంట్రీ ఇచ్చిన సీబీఐ అధికారులకు ప‌శ్చిమ బెంగాల్ పోలీసులు ఏ రీతిన చుక్క‌లు చూపించారో... అదే త‌ర‌హా శాస్తిని తెలంగాణ పోలీసుల‌కు త‌ప్ప‌ద‌ని కూడా టీడీపీ నేత‌లు చెబుతున్నారు. ఈ క్ర‌మంలో చాలా సేఫ్ జోన్‌ లోనే ఉన్నాడ‌ని భావిస్తున్న అశోక్‌ ను ప‌ట్టేయ‌డం స్టీఫెన్ ర‌వీంద్ర‌కు అంత ఈజీ కాదేమోన‌న్న వాద‌న వినిపిస్తోంది. అయితే ఎన్ని అడ్డంకులు ఎదురైనా కూడా అశోక్‌ను అరెస్ట్ చేస్తామ‌ని చెబుతున్న స్టీఫెన్ ఏపీలోకి ఎంట్రీ ఇస్తే మాత్రం యుద్ధం త‌ప్ప‌ద‌న్న విశ్లేష‌ణ‌లూ ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా సాగుతున్నాయి.
Tags:    

Similar News