తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని సొంతం చేసుకోవటమే ఏకైక లక్ష్యంగా డిసైడ్ అయి.. ముందుగా వేసుకున్న రోడ్ మ్యాప్ కు తగ్గట్లు పావులు కదుపుతూ.. తెలంగాణలో రాజకీయ అగ్గిని రాజేసే సరికొత్త ఎత్తులకు కమలనాథులు సిద్ధమైన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ నెల 17న తెలంగాణ విమోచన/విలీన దినోత్సవాన్ని బీజేపీ.. టీఆర్ఎస్ లు ఎవరికి వారు.. వారి వాదనల ప్రకారం నిర్వహించేందుకు చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణలో రాజకీయ వేడిని మరో లెవల్ కు తీసుకెళ్లేలా మారిందన్న మాట వినిపిస్తోంది.
ఈ సెప్టెంబరు 17నాటికి 74 ఏళ్లు పూర్తై.. 75వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న నేపథ్యంలో.. తమ వాదనలకు సరిపోయే విధానాన్ని అనుసరించేందుకు వీలుగా బీజేపీ.. టీఆర్ఎస్ లు పోటాపోటీగా వేదికల్ని.. వేడుకల్ని సిద్ధం చేస్తున్నాయి. విమోచన అంటే.. నిజాం పాలన నుంచి నాటి హైదరాబాద్ స్టేట్ (తెలంగాణ.. మహారాష్ట్రలో కొంత భాగం.. కర్ణాటకలోని మరికొంత భాగం) లోని ప్రజలకు స్వేచ్ఛను ప్రసాదించే విషయంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ నిర్వహించిన ఆపరేషన్ గా బీజేపీ చెబుతుంది. ఈ వ్యవహారాన్ని బీజేపీ అండ్ కో 'విమోచన' దినంగా వ్యవహరిస్తుంటుంది.
దీనికి భిన్నంగా ఈ వ్యవహారాన్ని కొందరు మితవాదులు 'విలీన' దినోత్సవంగా నిర్వహిస్తుంటారు. నిజాం ప్రభువు భారతదేశంలో తన హైదరాబాద్ స్టేట్ ను విలీనం చేసినట్లుగా వాదనలు వినిపిస్తారు. నియంత పోకడలతో.. భారత రాజ్యం చెప్పినట్లుగా దేశంలో విలీనం చేయని నేపథ్యంలో భారత సైన్యం హైదరాబాద్ స్టేట్ ను సైనిక చర్యతో సొంతం చేసుకోవటం.. అప్పటికి కానీ నిజాం రాజ్యంలోని ప్రజలకు స్వాతంత్య్రం రాలేదన్న విషయం తెలిసిందే.
ఆసక్తికరమైన విషయం ఏమంటే.. తెలంగాణ ఉద్యమ సమయంలో గులాబీ బాస్ కేసీఆర్ సైతం విమోచన సిద్ధాంతానికే ఓటేసేవారు. తాను కోరుకున్నట్లుగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన పక్షంలో.. సెప్టెంబరు 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తానని చెప్పేవారు. కానీ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం.. తన మాటలకు భిన్నంగా ఆయన.. విలీన దినోత్సవంగానే వ్యవహరిస్తున్నారు. విమోచన దినోత్సవం అన్నంతనే మైనార్టీల మనోభావాలు దెబ్బ తింటాయన్న ఉద్దేశమే దీనికి కారణంగా చెబుతారు.
ఈ సున్నితమైన తేడాను తాజాగా బీజేపీ.. టీఆర్ఎస్ లు తమ రాజకీయ ఎజెండాకు తగ్గట్లు వినిపించనున్నాయి. కేసీఆర్ విలీన వాదనలకు భిన్నంగా కమలనాథులు విమోచన వాదాన్ని వినిపిస్తున్నారు. విమోచన వాదాన్ని తెలంగాణ వచ్చినంతనే వదిలేసిన కేసీఆర్.. తన పాత మాటల్ని గుర్తు తెచ్చుకోవటానికి అస్సలు ఇష్టపడటం లేదు. దీన్ని వేలెత్తి చూపిస్తూ.. కేసీఆర్ మాదిరి కాకుండా తాము మొదట్నించి చెబుతున్నట్లుగానే విమోచన వాదం మీదనే తాము నిలబడి ఉన్నట్లుగా బీజేపీ చెబుతోంది.
తాజాగా తెలంగాణలో తెలంగాణ అధికారపక్షం.. విపక్షమైన బీజేపీలు రెండు ఎవరికి వారు తమ వాదనలకు తగ్గట్లు విమోచన/విలీన వేడుకల్ని నిర్వహించేందుకు ఎవరికి వారు తమదైన ప్లానింగ్ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర బలగాలతో పరేడ్ నిర్వహించేందుకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా డిసైడ్ కాగా.. ఈ కార్యక్రమానికి కర్ణాటక.. మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు ఆహ్వానాన్ని అందిస్తున్నారు. ఏడాది పాటు ఉత్సవాలు నిర్వహించేలా ప్లాన్ చేశారు.
దీనికి పోటీగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విలీన ఉత్సవాల్ని ఏడాది పాటు నిర్వహించేలా ఈ రోజు నిర్వహించే కేబినెట్ భేటీలో నిర్ణయిస్తారని చెబుతున్నారు. బీజేపీ మాదిరి కాకుండా విలీన ఉత్సవాల్ని భారీగా నిర్వహిచంటంతో పాటు.. బీజేపీ నిర్వహించాలని తలపెట్టిన విమోచన దినోత్సవాన్ని అడ్డుకునేందుకు ఉండే అవకాశాల్ని వెతుకుతున్నట్లుగా చెబుతున్నారు. ఈ పోటాపోటీ వేడుకలతో తెలంగాణలో రాజకీయ అగ్గి మరింత రాజుకోవటం ఖాయమన్న మాట వినిపిస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.